Sandeep Reddy-Allu Arjun: ఐకాన్ స్టార్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా బిజీలో ఉన్నాడు. అయితే ఆయన ఈ సినిమా అయిపోయిన తర్వాత అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలనుకున్నాడు. కానీ అది క్యాన్సల్ ఆయన విషయం మనకు తెలిసిందే. ఇక మరి అల్లు అర్జున్ ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడు అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ లిస్టులో అట్లీ తోపాటు సందీప్ రెడ్డి వంగ కూడా ఉన్నాడు.
మరి సందీప్ ప్రస్తుతానికి ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమా పూర్తవ్వడానికి ఈజీగా సంవత్సరం పడుతుంది. మరి ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో గాని లేదా వేరే డైరెక్టర్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ ఈ గ్యాప్ లో ఎవరితో సినిమా చేసిన కూడా సందీప్ రెడ్డి వంగాతో చేసే సినిమా మాత్రం భారీ రేంజ్ లో ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇది చాలా బోల్డ్ కంటెంట్ తో రాబోతుందట.
Also Read: Double iSmart: లైగర్ మూవీ ఎఫెక్ట్ డబుల్ ఇస్మార్ట్ మీద పడుతుందా..?
ఇందులో అల్లు అర్జున్ కి అమ్మాయిలు అంటే పిచ్చి ఉంటుందట ఇక వాళ్ల కోసం ఆయన ఏం చేశాడు అనే కాన్సెప్ట్ తో వస్తుందట. ఇక దీని విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేసి మరోసారి తనను తాను స్టార్ హీరో గా ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ మాత్రం కొన్ని వేరే సినిమాలకు కమిట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇదే క్రమంలో అల్లు అర్జున్ తో ఆయన సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఒకవేళ పుష్ప 2 సినిమా కనక సూపర్ సక్సెస్ అయినట్టైతే అల్లు అర్జున్ ఈ సక్సెస్ తో మరోసారి మాస్ సినిమానే చేసే అవకాశాలైతే ఉన్నాయి. మరి త్రివిక్రమ్ ఏం చేసినా కూడా క్లాస్ మాస్ యాక్షన్ ని కలిపి చేస్తాడు. కాబట్టి అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడా లేదంటే వేరే మాస్ దర్శకుడి కి అవకాశం ఇచ్చే ఛాన్స్ లు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది…