Vijayawada: ప్రియురాలి కోసం ప్రియుడు చేసిన దారుణం

భవానిపురం లోని చెరువు సెంటర్ కు చెందిన శ్రీరామచంద్ర ప్రసాద్ బృందావన కాలనీలో కిరాణా షాపును నడుపుతున్నాడు. ఆయనకు దార్షిని అనే కుమార్తె ఉంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. విద్యాధర పురానికి చెందిన గడ్డం శివమణికంఠ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నాడు.

Written By: Dharma, Updated On : June 28, 2024 4:39 pm

Vijayawada

Follow us on

Vijayawada: తన కూతురు జోలికి రావొద్దని అన్నందుకు ప్రియురాలి తండ్రిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. విజయవాడలో జరిగింది ఈ దారుణం. స్థానికంగా సంచలనం రేకెత్తించింది. విజయవాడ బృందావన్ కాలనీ లో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

భవానిపురం లోని చెరువు సెంటర్ కు చెందిన శ్రీరామచంద్ర ప్రసాద్ బృందావన కాలనీలో కిరాణా షాపును నడుపుతున్నాడు. ఆయనకు దార్షిని అనే కుమార్తె ఉంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. విద్యాధర పురానికి చెందిన గడ్డం శివమణికంఠ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నాడు. విజ్ఞాన్ విహార్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మణికంఠ సోషల్ మీడియా ద్వారా దార్షినికి పరిచయం అయ్యాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తెను హెచ్చరించాడు. మణికంఠను మరిచిపోవాలని చెప్పాడు. దీంతో దార్షిని అతడికి దూరంగా ఉంటుంది. మణికంఠ పెళ్లి చేసుకుందామని వారించినా వినడం లేదు. అయితే తన కుమార్తె వద్దన్నా వెంటపడుతున్నాడని శ్రీరామచంద్ర ప్రసాద్ కొంతమందిని తీసుకొని మణికంఠ ఇంటికి వెళ్లి పంచాయతీ పెట్టాడు. దీంతో మణికంఠ ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయి.

దార్షిని విషయంలో జరిగిన గొడవల్లో భాగంగా మణికంఠ తల్లి గురువారం ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయింది. అయితే దీనికి శ్రీరామచంద్ర ప్రసాద్ కారణమని మణికంఠ భావించాడు. అతడిని ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీరామచంద్ర ప్రసాద్ కుమార్తెను తీసుకుని షాపు నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఆ సమయంలో బైక్ పై వచ్చిన మణికంఠ ఢీ కొట్టాడు. కిందపడిన శ్రీరామచంద్ర ప్రసాద్ పై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. దార్షిని అడ్డుకున్నా వినలేదు. కొన ఊపిరితో ఉన్న శ్రీరామచంద్ర ప్రసాద్ ను రోడ్డు పక్కకు తీసుకెళ్లి సఫర్యలు చేస్తుండగా మరోసారి కత్తితో పొడిచాడు మణికంఠ. స్థానికుల సాయంతో శ్రీరామచంద్ర ప్రసాద్ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.