https://oktelugu.com/

Kukatpally: చిత్తు కాగితాలు ఏరుకునే మహిళపై పాడుపని.. పాతికేళ్ల యువకుల పైశాచికత్వం

హైదరాబాద్ లోని మూసాపేట వై జంక్షన్ సమీపంలో.. దీనిని బాలానగర్ నుంచి కూకట్ పల్లి వెళ్లే రోడ్డు అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో విష్ణు ప్రియ లాడ్జి ఉంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 23, 2024 / 10:12 AM IST

    45-year-old woman found dead in Kukatpally

    Follow us on

    Kukatpally: ఆ మహిళది పేద కుటుంబం. పొద్దంతా చిత్తు కాగితాలు ఏరుకొని.. వాటిని విక్రయిస్తే.. వచ్చిన సొమ్మే ఆమె కుటుంబానికి జీవనాధారం. అయితే అలాంటి మహిళపై ఆ దుర్మార్గుల కన్ను పడింది. కన్ను, మిన్ను కాకుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తీవ్రంగా రక్తస్రావమై ఆ మహిళ మృతి చెందింది. ఈ దారుణం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

    హైదరాబాద్ లోని మూసాపేట వై జంక్షన్ సమీపంలో.. దీనిని బాలానగర్ నుంచి కూకట్ పల్లి వెళ్లే రోడ్డు అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో విష్ణు ప్రియ లాడ్జి ఉంది. దాని పక్కన భారీ కమర్షియల్ బిల్డింగ్ లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఓ భవనం సెల్లార్ లో షట్టర్ ముందు 45 సంవత్సరాల మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి ఒంటిపై దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పైగా ఆమె మర్మాంగం నుంచి తీవ్రంగా రక్తస్రావమైన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పోలీసులు ఇది హత్య అని ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ మహిళ మృతదేహం పక్కన ఒక సంచిలో దొరికిన చీటీపై మహిళ పేరు రాసి ఉంది. సంచిలో చిత్తు కాగితాలు విపరీతంగా ఉన్నాయి… ఆమె వాటిని ఏరుకొని జీవిస్తోందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అయితే ఆ ప్రాంతం పరిధిలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించారు. 25 సంవత్సరాల వయసున్న ఇద్దరు యువకులు.. ఆ దారుణం జరిగిన భవనం పక్కన ఉన్న సందులో కొంతసేపు ఆ మహిళతో మాట్లాడారు. ఏం జరిగిందో తెలియదు గానీ ఆమెను బలవంతంగా సెల్లార్ లోని షట్టర్ వద్దకు లాక్కుని వెళ్లారు. కొంతసేపటి తర్వాత వారిద్దరూ బైక్ పై కూకట్ పల్లి వైపు వెళ్లిపోయారు.

    అయితే వారిద్దరే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా ఆమెపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళ మృతదేహం పై ఉన్న వేలిముద్రలను, ఇతర ఆనవాళ్లను పోలీసులు సేకరించారు.. అయితే ఆ మహిళను కోరిక తీర్చాలని వారు డిమాండ్ చేయడం.. దానికి ఆమె ఒప్పుకోకపోవడం.. దీంతో వారిద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమెపై తీవ్రస్థాయిలో అత్యాచారం చేయడంతో.. మర్మాంగం నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగి మృతి చెందిందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ సంఘటన హైదరాబాదులో సంచలనం సృష్టించింది.