https://oktelugu.com/

Ram Charan: చరణ్ కూతురు క్లిన్ కారకు ప్రాణగండం ఉందా? వేణు స్వామి ఏమంటున్నారు?

క్లిన్ కార పుట్టిన వెంటనే వేణు స్వామి పాప జాతకం చెప్పాడు. అప్పుడే పుట్టిన పాపకు జాతకం చెప్పడం ఏంటని వేణు స్వామిని ట్రోల్ చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 23, 2024 / 10:04 AM IST

    Venu Swamy About Ram Charan Daughter Horoscope

    Follow us on

    Ram Charan: రామ్ చరణ్ కూతురు క్లిన్ కార జాతకం పై వేణు స్వామి మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన ఒకింత ఫైర్ అయ్యాడు. విషయంలోకి వెళితే… 2023 జూన్ 20న ఉపాసన తల్లి అయ్యారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. రామ్ చరణ్ దంపతులు తమ పాపకు క్లిన్ కార అని పేరు పెట్టారు. గాయత్రి సహస్ర నామం నుండి ఈ పేరు తీసుకున్నట్లు చిరంజీవి వెల్లడించారు.

    క్లిన్ కార పుట్టిన వెంటనే వేణు స్వామి పాప జాతకం చెప్పాడు. అప్పుడే పుట్టిన పాపకు జాతకం చెప్పడం ఏంటని వేణు స్వామిని ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ పై వేణు స్వామి స్పందించారు. చెప్పాలంటే ఆయన ఒకింత సీరియస్ అయ్యాడు. రాజుల కాలంలో రాజులు ప్రసవించిన వెంటనే రాజ జ్యోతిష్యులు పిల్లల జాతకం చెప్పారు. దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకునేవారు. ప్రముఖులకు పిల్లలు పుట్టినప్పుడు వారి జాతకాలు చెప్పడం ఆనవాయితీగా ఉంది. దాని వలన వాళ్ళను అభిమానించే వాళ్ళు సంతోషిస్తారు.

    బాలారిష్టం తో పుట్టిన పిల్లలకు మాత్రమే వెంటనే జాతకం రాయొద్దని శాస్త్రం చెబుతుంది. బాలారిష్టం ఉన్న పిల్లకు 7వ రోజు, 7వ నెల, 7వ సంవత్సరం, 17వ సంవత్సరం, 37వ సంవత్సరం, 77వ సంవత్సరంలో ప్రాణ గండం ఉంటుంది. అందుకే బాలారిష్టం ఉన్న పిల్లల జాతకాలు వెంటనే రాయొద్దని అంటారు. ఉపాసన రాజయోగంలో పుట్టింది. ఆమె పుట్టిన కారణంగా ఆ కుటుంబానికి కీర్తి సంపదలు వస్తాయి.

    ఇది తెలియని మూర్ఖులు నేను క్లిన్ కార జాతకం చెప్పానని ట్రోల్ చేస్తున్నారు వేణు స్వామి అన్నారు. దీంతో క్లిన్ కార మహత్జాతకంలో పుట్టింది ఆమెకు ఎలాంటి ప్రాణ గండం లేదని తేలిపోయింది. వేణు స్వామి గతంలో చెప్పిన చాలా విషయాలు నిజం అయ్యాయి. క్లిన్ కార విషయంలో కూడా ఆయన జాతకం నిజం అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి. క్లిన్ కార కడుపులో పడ్డ నాటి నుండి మెగా ఫ్యామిలీలో అనేక శుభకార్యాలు చోటు చేసుకున్నాయి.