వ్యాక్సినేషన్ ఎన్నటికి పూర్తయ్యేనో?

కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో టీకా పంపిణీపై అందరికీ ఆసక్తి పెరిగింది. వ్యాక్సినేషన్ విషయంలో దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోగా మనదేశంలో మందగించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు మొదటి డోసు వేసుకున్న వారి సంఖ్య 20 కోట్లు దాటిందని చెబుతున్నారు. ఇలాగైతే కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ పూర్తి కావడానికి ఇంకెంత కాలం కావాలనే ప్రశ్న తలెత్తుతోంది. ఇతర దేశాలు కరోనా […]

Written By: Srinivas, Updated On : May 29, 2021 1:55 pm
Follow us on

కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో టీకా పంపిణీపై అందరికీ ఆసక్తి పెరిగింది. వ్యాక్సినేషన్ విషయంలో దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇతర దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోగా మనదేశంలో మందగించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు మొదటి డోసు వేసుకున్న వారి సంఖ్య 20 కోట్లు దాటిందని చెబుతున్నారు. ఇలాగైతే కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ పూర్తి కావడానికి ఇంకెంత కాలం కావాలనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇతర దేశాలు కరోనా వ్యాక్సిన్ల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఎక్కువ కంపె నీలకు అనుమతులు ఇవ్వడంతో ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మనదేశంలో రెండు టీకాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. దీంతో వ్యాక్సినేషన్ ఆలస్యమవుతోంది. ప్రజల్లో ఆందోళన రోజురోజుకు ఎక్కువవుతోంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏనాటికి పూర్తయ్యేనో స్పష్టత ఇవ్వడం లేదు.

మూడో వేవ్ రానుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ పరిస్థితులకు అనుగుణంగా సాగడం లేదు. కేంద్రం అందించాలే గానీ భారీ ఎత్తున వ్యాక్సినేషన్ జరిపించడానికి సన్నద్ధంగా ఉన్నామంటూ రాష్ర్టాలు ప్రకటిస్తున్నా కేంద్రంలో మాత్రం చొరవ లేకుండా పోతోంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రయ ఏమేరకు విజయం సాధించేనో వేచి చూడాల్సిందే మరి. 45 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్ వేస్తామని చె ప్పడంతో చిన్న వయసు వారికి డోసు అందడం గగనమే అని తెలుస్తోంది.

పలు దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశాయి. బ్రిటన్ లో తాజాగా మరో వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్కువ జనాభా ఉండి వారిలో కూడా ఎ క్కువ మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశాలే వ్యాక్సిన్ల కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇండియాలో మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోడం లేదు. కేంద్ర ప్రభుత్వ తీరుపై సామాన్యుల్లో అసహనం పెరిగిపోతోంద.