https://oktelugu.com/

చిన్నాచితకా ఛాన్స్ లతో చితికిపోతున్న క్రేజీ బ్యూటీ !

ఎంట్రీలోనే పెద్ద హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అనే మార్క్ ను సొంతం చేసుకుంది. ఓ దశలో మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో ఆమెను అడగడానికి కూడా భయపడేవాళ్లు. ఆమెను మనం భరించగలమా అనుకునేవాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్టు.. హీరోయిన్ల స్టార్ డమ్ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ విషయం అర్థమవడానికి ఈ బ్యూటీకి చాల కాలమే పట్టింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కట్ చేస్తే.. వచ్చిన […]

Written By:
  • admin
  • , Updated On : May 29, 2021 / 02:10 PM IST
    Follow us on

    ఎంట్రీలోనే పెద్ద హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అనే మార్క్ ను సొంతం చేసుకుంది. ఓ దశలో మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో ఆమెను అడగడానికి కూడా భయపడేవాళ్లు. ఆమెను మనం భరించగలమా అనుకునేవాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్టు.. హీరోయిన్ల స్టార్ డమ్ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు.

    ఈ విషయం అర్థమవడానికి ఈ బ్యూటీకి చాల కాలమే పట్టింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కట్ చేస్తే.. వచ్చిన ఛాన్స్ లు మిస్ అయ్యాయి. కొత్తగా ఛాన్స్ లు కరువయ్యాయి. ఇప్పుడు చిన్నాచితకా హీరోల సినిమాల్లో కూడా నటిస్తా అంటూ మేనేజర్ల చేత కబురు పంపుతుందట. కానీ ఈ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చేవాడే కనబడుటలేదు.

    ఇంతకీ ఈ బ్యూటీ ఎవరంటే.. ‘అను ఇమ్మానుయేల్’. నాని, విశాల్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య ఇలా కెరీర్ స్టార్టింగ్ లోనే పాపులర్ స్టార్స్ తో జత కట్టి.. మంచి స్టార్ డమ్ సంపాదించింది. అయితే, వరుస అపజయాలకు తోడు అమ్మడు వ్యవహార శైలి కారణంగా కూడా అమ్మడు కెరీర్ కి భారీ బ్రేక్ పడేలా చేసింది. ఒక్కసారిగా అవకాశాలు గల్లంతయ్యాయి.

    ప్రస్తుతం అను ఇమ్మానుయేల్ కనీసం చిన్న హీరోల చిత్రాలలోనైనా బిజీగా మారాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది స్టార్టింగ్ లో ‘అల్లుడు అదుర్స్’లో సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గా నటించి.. తనకు తానే ఇక తనది తక్కువ స్థాయి అని కన్ఫర్మ్ చేసుకుంది. చివరకు ఇప్పుడు అల్లు శిరీష్ సరసన నటిస్తోంది. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాల్సిన ఈ బ్యూటీ, ఇలా చిన్నాచితకా అవకాశాలతో ఇలా చితికిపోతోంది అనుకోలేదు.