https://oktelugu.com/

ప్రజలకు శుభవార్త.. కరోనా వ్యాక్సిన్ తో ఆ లక్షణాలకు చెక్..?

దేశంలో గతేడాది లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి వైరస్ నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా బారిన పడిన వాళ్లను దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న కొన్ని నెలల తరువాత కూడా ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. Also Read: తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్? అయితే శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో ఆసక్తికరమైన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 25, 2021 5:14 pm
    Follow us on

    Corona Virus Vaccine

    దేశంలో గతేడాది లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి వైరస్ నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా బారిన పడిన వాళ్లను దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న కొన్ని నెలల తరువాత కూడా ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

    Also Read: తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్?

    అయితే శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కరోనా బారిన పడి దీర్ఘకాలిక లక్షణాలతో బాధ పడుతున్న వాళ్లు కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కరోనా బారిన పడిన వాళ్లలో ఎక్కువగా అలసట, నిరంతర దగ్గు, శ్వాస తీసుకోలేకపోవడం, వాసన కోల్పోవడం, కండరాల బలహీనత, ఇన్సోమినియా, ఇతర లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

    Also Read: మరోసారి విజృంభిస్తున్న కరోనా..

    కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ఈ లక్షణాలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారిలో 66 మందిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. వ్యాక్సిన్ వేయించుకోని వారితో పోలిస్తే వ్యాక్సిన్ వేయించుకున్న వారి దీర్ఘకాలిక కరోనా లక్షణాల్లో మెరుగుదల కనిపించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా బారిన పడిన వాళ్లు వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

    మరోవైపు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి కూడా కేంద్రం వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది.