https://oktelugu.com/

షాక్ లగా: వైఎస్ షర్మిల పోటీచేసే నియోజకవర్గం ఇదే

వైఎస్ షర్మిల చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గెలిచే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని అందరికీ షాకిచ్చింది. తాను పోటీచేసే అసెంబ్లీ స్థానాన్ని తాజాగా ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కార్యకర్తలతో సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ ద్వారానే రాబోతున్నారు. ఈ క్రమంలోనే అదే జిల్లా నుంచి పోటీచేయడానికి రెడీ అయ్యారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని […]

Written By: NARESH, Updated On : March 24, 2021 7:18 pm
Follow us on

YS Sharmila

వైఎస్ షర్మిల చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గెలిచే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని అందరికీ షాకిచ్చింది. తాను పోటీచేసే అసెంబ్లీ స్థానాన్ని తాజాగా ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కార్యకర్తలతో సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ ద్వారానే రాబోతున్నారు. ఈ క్రమంలోనే అదే జిల్లా నుంచి పోటీచేయడానికి రెడీ అయ్యారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన రాజకీయ భవిష్యత్ కు కార్యక్షేత్రంగా షర్మిల ఎంచుకోవడం విశేషం.

ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల తాజాగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో తను పోటీచేసేది పాలేరు నియోజకవర్గం అని క్లారిటీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలానో.. తనకు ఖమ్మం జిల్లా పాలేరు అలాంటిదని.. తాను పాలేరు నుంచే రాజకీయ రంగంలోకి దిగుతానని.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో మన ప్రభంజనాన్ని ఆపలేరని ఆత్మీయ సమావేశంలో షర్మిల ప్రకటించారు.

పాలేరు నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. గతంలో రాంరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరుఫున వరుసగా గెలిచారు. ఆయన మరణం తర్వాత టీఆర్ఎస్ నుంచి తుమ్మల గెలవగా.. 2018లో మళ్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపేందర్ రెడ్డి గెలిచాడు. రెడ్డిలు అధికంగా ఉండి.. కాంగ్రెస్ కంచుకోట అయిన ఇక్కడి నుంచి పోటీచేయాలని షర్మిల డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పని అయిపోవడం.. ఇక్కడ టీఆర్ఎస్ బలంగా లేకపోవడం షర్మిలకు ప్లస్ అవుతోంది.