ఈ మామిడి తింటున్నారా.. ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..?

వేసవి కాలం వచ్చిందంటే మనలో చాలామంది మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. బంగినపల్లి, కీసర, ఇతర మామిడిపండ్లకు సాధారణ మామిడి పండ్లతో పోలిస్తే డిమాండ్ ఎక్కువగా ఉంది. మామిడి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మామిడి పండ్లలో శరీరానికి అవసరమైన విటమిన్లతో పాటు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే మామిడి పండ్లే ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. Also Read: ఎల్లో పుచ్చకాయ తినడం వల్ల […]

Written By: Navya, Updated On : మార్చి 25, 2021 4:51 సా.
Follow us on

వేసవి కాలం వచ్చిందంటే మనలో చాలామంది మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. బంగినపల్లి, కీసర, ఇతర మామిడిపండ్లకు సాధారణ మామిడి పండ్లతో పోలిస్తే డిమాండ్ ఎక్కువగా ఉంది. మామిడి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మామిడి పండ్లలో శరీరానికి అవసరమైన విటమిన్లతో పాటు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే మామిడి పండ్లే ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.

Also Read: ఎల్లో పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

మామిడి పండ్లు త్వరగా పండటానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి వ్యాపారులు కార్బైడ్ తో పాటు ఇతర కెమికల్స్ ను వాడుతున్నారు. ఆ కెమికల్స్ వల్ల యువతులకు గర్భధారణ సమస్యలు తలెత్తితే పురుషులను కూడా అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కార్బైడ్ లాంటి రసాయన పదార్థాలను నియంత్రించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. సహజంగా మగ్గబెట్టిన పండ్లు అందంగా ఉండవని వైద్యులు చెబుతున్నారు.

Also Read: డీహైడ్రేషన్ తో బాధ పడుతున్నారా.. చెక్ పెట్టే చిట్కాలివే..?

కెమికల్స్ వాడితే పండ్లు ఆకర్షణీయంగా కనిస్తాయని ఫలితంగా సాధారణ పండ్లతో పోలిస్తే కార్బైడ్ పండ్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కార్బైడ్ వాడిన పండ్లనే ఎక్కువమంది కొనుగోలు చేస్తూ ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్బైడ్ ను వినియోగిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రజలు మామిడిపండ్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

పిండి పదార్థాలు, చక్కెర్లు, పీచు పదార్థాలు, వివిధ విటమిన్లు లభించే మామిడి కార్బైడ్ ల వల్ల ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. అధికారులు చర్యలు తీసుకుంటే కార్బైడ్ వినియోగం పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం ఉంది.