ఆ మాస్క్ వాడితే కరోనా నుంచి రక్షణ.. ఎలా వినియోగించాలంటే..?

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మాస్క్ ను వినియోగిస్తున్నా కొంతమంది వైరస్ బారిన పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ 95 మాస్క్ ను వాడితే మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎన్ 95 మాస్క్ వాడటం సాధ్యం కాకపోతే వస్త్రంతో తయారు చేసిన మాస్క్ లను వాడాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలను వేగవంతం […]

Written By: Navya, Updated On : May 13, 2021 2:55 pm
Follow us on

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మాస్క్ ను వినియోగిస్తున్నా కొంతమంది వైరస్ బారిన పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ 95 మాస్క్ ను వాడితే మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎన్ 95 మాస్క్ వాడటం సాధ్యం కాకపోతే వస్త్రంతో తయారు చేసిన మాస్క్ లను వాడాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలను వేగవంతం చేయడం ద్వారా మాత్రమే ఎంతమంది వైరస్ బారిన పడ్డారో తెలుసుకోవడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా బారిన పడిన వాళ్లకు ఇంట్లోనే చికిత్స అందించడం ద్వారా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు వేగవంతం చేస్తే లక్షణాలు లేకపోయినా కరోనా సోకిన వాళ్లను గుర్తించవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఎన్ 95 మాస్కుల వాడకం వల్ల కరోనా సోకే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎన్ 95 మాస్కులు 95 శాతం రక్షణ కల్పిస్తాయని అయితే ఈ మాస్కులను వదులుగా ధరించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. డబుల్ మాస్క్ లు పెట్టుకోవడం ద్వారా 75 శాతం రక్షణ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎన్ 95 మాస్కులు అందుబాటులో లేని పక్షంలో సర్జికల్ మాస్క్ ధరించాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. హైఫై మాస్కులు అంటే హై ఫిల్టరేషన్, హై ఫిట్ మాస్కులు అని ఈ మాస్కులు వాడటం ద్వారా కూడా కరోనా ముప్పును తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.