
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నేపథ్యంలో జూన్ లో జరగాల్సిన పరీక్షలను అక్టోబరు 10కి వాయిదా వేసింది. ఐఏెస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తో పాటు ఇతర కేంద్ర సర్వీసులకు యూపీఎస్ సీ సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా 27 జూన్, 2021 జరగాల్సిన ప్రలిమ్స్ ను కొవిడ్ నేపథ్యంలో యూపీఎస్ సీ వాయిదా వేసింది. ఈ పరీక్షను 10 అక్టోబరు 2021 న నిర్వహించనున్నట్లు తెలిపింది.