https://oktelugu.com/

‘టీఎన్ఆర్’ ఫ్యామిలీకి సాయం చేసిన సినీ ప్రముఖులు వీళ్ళే !

సాయం చేయాలంటే మంచి మనసు ఉండాలి. ప్రముఖ ఇంటర్వ్యూ స్పెషలిస్ట్ ‘టిఎన్ఆర్’ మరణంతో ఆయన కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో ‘టిఎన్ఆర్’ ఫ్యామిలీ భవిష్యత్తు కష్టాల మయం అవుతుందేమో అని ఆందోళన చెందిన ఆయన అభిమానులకు గొప్ప ఊరటను కలిగిస్తున్నారు కొంతమంది సినిమా ప్రముఖులు. తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి 50 వేల రూపాయలను టిఎన్ఆర్ భార్య జ్యోతిగారి బ్యాంక్ ఎకౌంట్ కి సెండ్ చేసి టిఎన్ఆర్ ఫ్యామిలీకి అండగా నిలిచారు. […]

Written By:
  • admin
  • , Updated On : May 13, 2021 / 02:56 PM IST
    Follow us on


    సాయం చేయాలంటే మంచి మనసు ఉండాలి. ప్రముఖ ఇంటర్వ్యూ స్పెషలిస్ట్ ‘టిఎన్ఆర్’ మరణంతో ఆయన కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో ‘టిఎన్ఆర్’ ఫ్యామిలీ భవిష్యత్తు కష్టాల మయం అవుతుందేమో అని ఆందోళన చెందిన ఆయన అభిమానులకు గొప్ప ఊరటను కలిగిస్తున్నారు కొంతమంది సినిమా ప్రముఖులు.

    తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి 50 వేల రూపాయలను టిఎన్ఆర్ భార్య జ్యోతిగారి బ్యాంక్ ఎకౌంట్ కి సెండ్ చేసి టిఎన్ఆర్ ఫ్యామిలీకి అండగా నిలిచారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా తమకు తోచినంత సాయాన్ని ఆ కుటుంబానికి అందజేసి తమ ఉదారతను చాటుకోవాలనే సెన్స్ లో మెసేజ్ చేస్తూ మారుతి అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇంకా కొంతమంది టిఎన్ఆర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తోన్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే మెగాస్టార్ సాయం చేశారు. టిఎన్ఆర్ మరణ వార్త వినగానే, వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి టిఎన్ఆర్ కుటుంబ సభ్యులకు పర్సనల్ గా ఫోన్ చేసి, వారికీ ధైర్యం చెప్పడంతో పాటు వారి తక్షణ ఖర్చులు నిమిత్తం లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని కూడా అందజేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. మెగాస్టార్ తరువాత మిగిలిన హీరోలలో సాయాన్ని అందించిన నిజమైన హీరో సంపూర్ణేష్ బాబు.

    ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి కావాల్సింది డబ్బు కాదు, సాయం చేయాలనే సంకల్పం అని నిరూపించాడు సంపూర్ణేష్ బాబు. నిజానికి సంపూకే కొన్ని ఆర్ధిక కష్టాలు ఉన్నాయి. అయినా హీరోలందరి కంటే కూడా ముందుగా తానే ఏభై వేల రూపాయల సాయాన్ని ప్రకటించి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సంపూ మిగిలిన హీరోలు కంటే.. ఇలాంటి విషయాల్లో ముందు ఉండటం నిజంగా గొప్ప విషయమే.