
దేశంలో కరోనా విజృంభణ తగ్గినా కరోనా నుంచి కోలుకున్న వాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్న వాళ్లను ఎముకల సమస్యలు వేధిస్తూ ఉండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొందరు కూర్చుంటే లేవలేని స్థితిలో ఉన్నారని నాలుగు అడుగులు వేయడానికి కూడాఇబ్బందులు పడుతున్నారని తెలుస్తొంది. తుంటిలో నొప్పి, చేయి ఆడిస్తే ఇబ్బంది, కాలు కదిపితే నొప్పితో బాధ పడుతున్నారని సమాచారం.
కరోనా బాధితుల్లో ఎముకల సమస్యలు పెరగడం వల్ల ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. నీరసం, బలహీనత వల్ల కొంతమంది మంచాలకే పరిమితం అవుతుండటం గమనార్హం. మందులను వాడటం వల్ల జాయింట్లు డ్రై అవుతున్నాయని పోస్ట్ కోవిడ్ లో ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తున్నామని చాలామంది చెబుతున్నారు. డి విటమిన్ తీసుకోవడం వల్ల ఎముకల సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు.
ఎముకల సమస్యలు ఎదుర్కొనే వాళ్లు వ్యాయామాన్ని మొదలుపెట్టడంతో పాటు బలవర్థకమైన ఆహారం తీసుకుంటే మాత్రమే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఉద్యోగులు ఉదయం సమయంలో ఎండలో గడపడంతో పాటు ప్రతి అరగంటకు ఒకసారి కుర్చీలో నుంచి లేచి అటూఇటూ నడిస్తే మంచిది. పోస్ట్ కోవిడ్ లో డి విటమిన్ తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడే అవకాశం ఉంటుంది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏవైనా ఆరోగ్య సమస్యలు వేధిస్తే ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదిస్తే మంచిది. మందులు, వ్యాయామం, మంచి ఆహారం ద్వారా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎముకల సమస్యలు వస్తే ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించాలి. ఈ మధ్య కాలంలో బోన్ సెప్సిస్ వల్ల బాధ పడుతున్న ఐదుగురికి తుంటి మార్పిడి చేయాల్సి వచ్చిందని కృష్ణకిరణ్ అనే డాక్టర్ వెల్లడించారు.