Homeక్రీడలుక్రికెట్‌Pakistan Semifinal Qualification Scenario: ఏ ఊకో.. ఊకో.. పాకిస్తాన్ పని అయిపోలేదింకా..!

Pakistan Semifinal Qualification Scenario: ఏ ఊకో.. ఊకో.. పాకిస్తాన్ పని అయిపోలేదింకా..!

Pakistan Semifinal Qualification Scenario: అబ్బే.. అదేం మాటండి? “పాకిస్థాన్ పని అయిపోయింది” అని అంత మాట అనేశారు! వాళ్లది మామూలు టీమ్ కాదు.. అదో ‘మిరాకిల్’ మెషీన్. సరిగ్గా అందరూ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారనుకునే టైమ్‌లో ఎవరో ఒకరు వచ్చి ఆక్సిజన్ సిలిండర్ పెట్టినట్టు సెమీస్ ఆశలు మళ్ళీ చిగురిస్తాయి..

Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!

న్యూజిలాండ్ ఓడిపోవడం.. వీళ్ళకి దారి దొరకడం.. ఇదంతా చూస్తుంటే “తొందరపడి ముందే ఏడవకండి.. క్లైమాక్స్ ఇంకా ఉంది” అని బాబర్ ఆజం మనకి సిగ్నల్ ఇస్తున్నట్టే ఉంది.

పాకిస్థాన్ క్రికెట్ అంటేనే ఒక రోలర్ కోస్టర్ రైడ్. అది ఎప్పుడు పైకి వెళ్తుందో, ఎప్పుడు కింద పడుతుందో సాక్షాత్తూ ఆ జట్టుకే తెలియదు.. ఇప్పుడు శ్రీలంకతో మ్యాచ్ అంటే గెలిస్తే సరిపోదు.. గెలుపు గుర్రం మీద స్వారీ చేస్తూ గాలిలో పల్టీలు కొట్టాలి.

ఆ కండీషన్లు ఏంటో చూశారా?

ముందుగా బ్యాటింగ్ చేస్తే 64 పరుగుల తేడాతో గెలవాలి. అంటే శ్రీలంక బ్యాటర్లు క్రీజులోకి వచ్చి, కాసేపు గాలి పీల్చుకుని, మళ్ళీ పెవిలియన్‌కు వెళ్ళిపోవాలన్నమాట. ఇక
బౌలింగ్ చేస్తే 13.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. అంటే టీ20 మ్యాచ్‌ని కాస్తా కాస్తా ‘హాఫ్-టీ20’ లాగా ఆడేయాలి.

పాక్ ఫ్యాన్స్ పరిస్థితి ఇదీ..

న్యూజిలాండ్ ఓడిపోగానే “మా కుర్రాళ్ళు పులులు.. సెమీస్‌లో భారత్ – పాక్ ఫైనల్ ఖాయం!” అంటూ అప్పుడే మాజీలు కలలుకన్నారు. సెమీస్ ఈక్వేషన్లు చూశాక “అమ్మో! 13 ఓవర్లలో కొట్టాలా? 64 రన్స్ తేడాతో గెలవాలా? సరే.. అయితే తస్మాత్ జాగ్రత్త.. మా దగ్గర కాలిక్యులేటర్లు ఉన్నాయి! అంటూ గొప్పలకు పోతున్నారు.

మ్యాచ్ మొదలయ్యాక ఒక్క వికెట్ పడగానే.. “ఛా.. వెళ్ళిపోదాం పదండి.. ఆ ఫ్లైట్ ఏదో ఇప్పుడే ఎక్కేద్దాం.” అంటూ తొందరపెడుతారు.

శ్రీలంక వాళ్ళకి కూడా ‘ప్రతిభ’ అనే ఒకటి ఉంటుందని మనం మర్చిపోకూడదు. వాళ్ళు కూడా ఇదే గ్రౌండ్‌లో ఉంటారు కదా! ఏదో పాకిస్థాన్ ఒక్కటే బ్యాటింగ్, బౌలింగ్ చేసుకుంటున్నట్టు ఈ లెక్కలు చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది.

మొత్తానికి కివీస్ గడప వరకు వెళ్ళి ఆగింది. పాక్ ఆ గడప దాటాలంటే మాత్రం లంకను మామూలుగా కొడితే సరిపోదు.. ఏకంగా “సునామీ” సృష్టించాలి. చూద్దాం.. పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్తుందో లేక ఎప్పటిలాగే “మళ్ళీ వచ్చే కప్పు మనదే” అని సెల్ఫీలు దిగుతూ ఇంటికి వెళ్తుందో! చూడాలి మరీ..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version