ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతుంటే ఇతర వ్యాధులు ప్రజలకుమరింత టెన్షన్ పెడుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, ఇతర సీజనల్ జ్వరాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్లేట్ లెట్ కౌంట్ తగ్గడం వల్ల ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోతే డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రతిరోజూ కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ప్లేట్ లెట్ కౌంట్ ను సులభంగా పెంచుకోవచ్చు. బొప్పాయి ఆకులను తింటే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. పచ్చి ఆకులను వినియోగించకూడదని భావించే వాళ్లు ఆకులను ఉడకబెట్టి, దాని రసాన్ని తీసిన తర్వాత తినే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుంది. ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి దానిమ్మ పండ్లను కూడా తినవచ్చు. దానిమ్మ రసం తీసిన తర్వాత పదిహేను నిమిషాల్లో తాగాలి.
గుమ్మడికాయ ద్వారా ప్లేట్ లెట్స్ ను పెంచుకోవడం సాధ్యమవుతుంది. గుమ్మడికాయను మెత్తగా రుబ్బుకుని పేస్ట్ చేసి పిండి వేసి దాని రసాన్ని వెలికితీసి తినాల్సి ఉంటుంది. ఈ రసం తాగే వాళ్లు రుచి కోసం తేనెను జోడించవచ్చు. గుమ్మడి కాయను ఉడకబెట్టి స్మూతీ లేదా సూప్ రూపంలో చేసి తీసుకుంటే మంచిది. గోధుమ జోవర్ జ్యూస్ తాగడం వల్ల కూడా ప్లేట్ లెట్స్ తగ్గుతాయి.
గోధుమ గడ్డిని కడిగి మెత్తగా రుబ్బుకుని పిండి వేసి పేస్ట్ తయారు చేసి రసం తీసుకుని అందులో నిమ్మరసం కలిపి తాగితే మంచిది. ఇలా చేయడం వల్ల ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. గోధుమ గడ్డి దొరకకపోతే గోధుమలను ఒక కుండలో వేసి తీసుకోవాల్సి ఉంటుంది.