https://oktelugu.com/

సెకండ్ వేవ్ నుంచి మూడు రాష్ట్రాలకు ఉపశమనం

కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్నే తలకిందులు చేసింది. దీని ప్రభావంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా రక్కసితో దేశంలోని అన్ని రాష్ర్టాలు అతలాకుతలం అయ్యాయి. మూడు రాష్ర్టాలు మాత్రం ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. మహారాష్ర్ట, కర్ణాటక, ఢిల్లీ రాష్ర్టాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. రోజు వారీ కేసులు రోజురోజుకు పెరగడంతో జనం భయాందోళన చెందారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గినా ప్రజల్లో భయం మాత్రం పోవడం లేదు. కరోనా ప్రభావానికి జనం మనోవేదనకు గురవుతున్నారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 29, 2021 4:45 pm
    Follow us on

    కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్నే తలకిందులు చేసింది. దీని ప్రభావంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా రక్కసితో దేశంలోని అన్ని రాష్ర్టాలు అతలాకుతలం అయ్యాయి. మూడు రాష్ర్టాలు మాత్రం ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. మహారాష్ర్ట, కర్ణాటక, ఢిల్లీ రాష్ర్టాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. రోజు వారీ కేసులు రోజురోజుకు పెరగడంతో జనం భయాందోళన చెందారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గినా ప్రజల్లో భయం మాత్రం పోవడం లేదు. కరోనా ప్రభావానికి జనం మనోవేదనకు గురవుతున్నారు.

    ప్రస్తుతం మహారాష్ర్టలో 2.91 లక్షల స్థాయిలో యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 20 వేల వరకు నమోదవుతున్నాయి. రికవరీల సంఖ్య30 వేల స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఇలాగే కొనసాగితే కరోనా కేసుల సంఖ్య అక్కడ తగ్గితే నెల రోజుల్లో మహారాష్ర్టకు పూర్తిస్తాయిలో రిలీఫ్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    మహారాష్ర్ట తరువాత ఎక్కువ కేసులు నమోదైన రాష్ర్టం కర్ణాటక. ఇక్కడ ఐదు లక్షలు దాటాయి. కర్ణాటకలో కూడా కొద్ది రోజులుగా కేసులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం కర్ణాటకలో 3.72 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 22 వేల లోపు నమోదవుతున్నాయి. రికవరీల సంఖ్య హెచ్చుగా ఉంది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య రోజుకు 30 వేల స్థాయిలో ఉంది.

    కరోనాతో సతమతమవుతున్న వాటిలో ఢిల్లీ ఒకటి. ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. ఢిల్లీ పరిధిలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15 వేల లోపు చేరింది. రోజువారీ కేసుల సంఖ్య ఢిల్లీలో రెండు వేల లోపు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ తీవ్రత ఢిల్లీలో తగ్గినట్లే. ప్రస్తుతం కొన్ని రాష్ర్టాల్లో ఆక్సిజన్ డిమాండ్ బాగా తగ్గింది. తమిళనాడులో మాత్రం ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతోంది. అక్కడ రోజుకు 31 వేల కేసులు నమోదవుతున్నాయి.