https://oktelugu.com/

ఆనందయ్య మందు పంపిణీ ఎప్పుడో?

కరోనా వైరస్ తగ్గించడానికి ఆనందయ్య ఆయుర్వేద మందు తయారు చేశారు. ఉచితంగా పంపణీ చేశారు. కరోనా రోగులకు ఉపశమనం కలిగించారు. దీంతో సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందారు. ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. సుమారుగా వారం రోజుల నుంచి వైసీపీ నేతల వద్ద బందీగా ఉన్నారు. ఆయనపై ముందు రెండు కేసులు పెట్టి తరువాత పోలీస్ బందోబస్తుతో అరెస్టు చేయించారు. ఆనందయ్యపై హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆయుర్వేద మందు ఫార్ములా చెప్పమని వేధిస్తున్నారని ఆనందయ్య మరో […]

Written By: , Updated On : May 29, 2021 / 04:23 PM IST
Follow us on

కరోనా వైరస్ తగ్గించడానికి ఆనందయ్య ఆయుర్వేద మందు తయారు చేశారు. ఉచితంగా పంపణీ చేశారు. కరోనా రోగులకు ఉపశమనం కలిగించారు. దీంతో సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందారు. ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. సుమారుగా వారం రోజుల నుంచి వైసీపీ నేతల వద్ద బందీగా ఉన్నారు. ఆయనపై ముందు రెండు కేసులు పెట్టి తరువాత పోలీస్ బందోబస్తుతో అరెస్టు చేయించారు.

ఆనందయ్యపై హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆయుర్వేద మందు ఫార్ములా చెప్పమని వేధిస్తున్నారని ఆనందయ్య మరో పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ నేతలు దురుద్దేశంతోనే అదుపులోకి తీసుకుని బందీగా ఉంచుకున్నారు. చివరికి వదిలిపెట్టారు. మరోవైపు నెల్లూరులో ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభమైందని చెప్పగా ఎవరు రావొద్దని ఆనందయ్య సూచించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆయనను నిర్బందంలోకి తీసుకున్నారు.

ఆనందయ్య అరెస్టుపై కృష్ణపట్నం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు కూడా జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందారు. తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. మీడియాలో సైతం కుట్రపూరితంగా ప్రసారాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆనందయ్య మందు వల్ల కొందరు చనిపోయారని వదంతులు వ్యాపిస్తున్నాయి. ప్రముఖ టీవీ ఛానళ్లలో బ్రేకింగులు సైతం వస్తున్నాయి. దీంతో ఆయనను బెదిరించడానికి నాటకాలు ఆడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.

ఆనందయ్య సొంత ఖర్చుతో మందు తయారు చేసి పంపిణీ చేశారు. ఇప్పుడు ఆయనపై లేనిపోని ఆరో పణలు చేస్తూ ఆయన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వమే ఆనందయ్యపై వ్యతిరేక ప్రచారం చేస్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆనందయ్య మందును ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.