https://oktelugu.com/

ఆన్ లైన్ క్లాసులు వినే పిల్లల తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్..?

కరోనా విజృంభణ వల్ల దేశంలో ఆన్ లైన్ క్లాసులకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థలు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నాయి. అయితే ఆన్ లైన్ క్లాసులు వినే పిల్లల తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులలో చాలామంది ఆన్ లైన్ గేమ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. నోటిపై కూడా..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 27, 2021 / 08:52 PM IST
    Follow us on

    కరోనా విజృంభణ వల్ల దేశంలో ఆన్ లైన్ క్లాసులకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థలు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నాయి. అయితే ఆన్ లైన్ క్లాసులు వినే పిల్లల తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆన్ లైన్ క్లాసులు వినే విద్యార్థులలో చాలామంది ఆన్ లైన్ గేమ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు.

    Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. నోటిపై కూడా..?

    స్మార్ట్ ఫోన్లలో, ల్యాప్ టాప్ లలో ఆడుతున్న స్మార్ట్ గేమ్స్ విద్యార్థుల కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గేమ్స్ మోజులో పడిన విద్యార్థులు సరిగ్గా చదువుకోకుండా బంగారం లాంటి భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన 6వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. తల్లిదండ్రులు చదువుకోవడం కోసం మొబైల్ కొనిస్తే ఆ మొబైల్ ను గేమ్స్ కోసం బాలుడు దుర్వినియోగం చేశాడు.

    Also Read: ఈ పని చేస్తే కరోనా సోకే అవకాశాలు తక్కువ.. ఏమిటంటే..?

    గేమ్ లో భాగంగా డ్రస్సులు, షూ, గన్నుల కోసం తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలలోని డబ్బులను బాలుడు ఖర్చు చేశాడు. కొడుకు బ్యాంక్ ఖాతాలోని డబ్బులను మాయం చేశాడని తెలిసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కునుకుల గ్రామంలోని ఇతర విద్యార్థులు కూడా ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలైనట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులకు డబ్బు అవసరమై ఇంట్లోనే దొంగతనం చేస్తున్నారు.

    మరి కొందరు విద్యార్థులు స్నేహితుల వద్ద అప్పులు కూడా చేశారని సమాచారం. తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలా చేయకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.