https://oktelugu.com/

సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే కరోనా వ్యాక్సిన్ పని చేస్తున్నట్లేనా..?

ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అయితే నిపుణులు మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత రెండు రోజుల పాటు తలెత్తే లక్షణాలు రోగనిరోధక వ్యవస్థ యాక్టివ్ అవుతోందని చెప్పే సంకేతాలేనని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒకరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేయవద్దని చెబుతున్నారు. శరీరంలో ఉండే ఒక విభాగం వైరస్, బ్యాక్టీరియాను వెంటనే గుర్తించగా ఆ ప్రాంతాన్ని తెల్ల రకకణాలు చుట్టుముడతాయని శాస్త్రవేత్తలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 11, 2021 / 03:51 PM IST
    Follow us on

    ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అయితే నిపుణులు మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత రెండు రోజుల పాటు తలెత్తే లక్షణాలు రోగనిరోధక వ్యవస్థ యాక్టివ్ అవుతోందని చెప్పే సంకేతాలేనని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒకరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేయవద్దని చెబుతున్నారు. శరీరంలో ఉండే ఒక విభాగం వైరస్, బ్యాక్టీరియాను వెంటనే గుర్తించగా ఆ ప్రాంతాన్ని తెల్ల రకకణాలు చుట్టుముడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా శరీరంలో ఇదే ప్రక్రియ జరుగుతుందని కొందరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకపోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. లక్షణాలు కనిపించనంత మాత్రాన కరోనా వ్యాక్సిన్ పని చేయడం లేదని భావించవద్దని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. రోగనిరోధక వ్యవస్థలోని రెండో భాగం వైరస్ ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలను తయారు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    వైరస్ నుంచి రెండో భాగమే అసలైన రక్షణ కల్పిస్తుందని అందువల్ల కొన్ని సందర్భాల్లో లింఫ్ నోడ్ లలో వాపు రావచ్చని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కరోనా వ్యాక్సిన్లను ఇచ్చిన తరువాత కొంతమందిలో తీవ్రస్థాయిలో ముప్పులను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లలో కొంతమందిలో రక్తం గడ్డలు కడుతున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

    కరోనా వ్యాక్సిన్ల వల్ల శరీరానికి లభించే ప్రయోజనాలతో పోలిస్తే ముప్పులు తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో మాత్రమే తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్లు తలెత్తుతున్నాయని అందువల్ల వ్యాక్సిన్ ను తీసుకునన్ తర్వాత కనీసం పావుగంట పాటు వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.