https://oktelugu.com/

Omicron: ఒమిక్రాన్‌పై బూస్టర్ డోస్ ప్రభావం చూపుతోందా.. నిపుణులు ఏమంటున్నారు..?

Omicron: భారత్‌తో పాటు ప్రపంచమంతా ప్రస్తుతం మళ్లీ కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జనాలు భయపడిపోతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ దాని ప్రభావం ఉండటం లేదు. ఈ క్రమంలోనే అన్ని దేశాల ప్రభుత్వాలు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కాగా, ఈ బూస్టర్ డోస్ ఒమిక్రాన్ వేరియంట్ పైన ప్రభావం చూపుతున్నదా? నిపుణులు ఏమంటున్నారు? అనే సంగతులు తెలుసుకుందాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ స్టార్ట్ అయింది. […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 14, 2022 11:46 am
    Omicron Variant

    Omicron Variant

    Follow us on

    Omicron: భారత్‌తో పాటు ప్రపంచమంతా ప్రస్తుతం మళ్లీ కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో జనాలు భయపడిపోతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ దాని ప్రభావం ఉండటం లేదు. ఈ క్రమంలోనే అన్ని దేశాల ప్రభుత్వాలు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కాగా, ఈ బూస్టర్ డోస్ ఒమిక్రాన్ వేరియంట్ పైన ప్రభావం చూపుతున్నదా? నిపుణులు ఏమంటున్నారు? అనే సంగతులు తెలుసుకుందాం.

    Omicron:

    Omicron:

    ఇప్పటికే దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ స్టార్ట్ అయింది. చాలా చోట్ల బూస్టర్ డోసును ప్రజలు తీసుకుంటున్నారు కూడా. ఇకపోతే బయోఫార్మాస్యూటికల్ సంస్థ ఆస్ట్రాజెనెకా బూస్టర్ డోస్.. ఒమిక్రాన్ వేరియంట్ పైన ఏ మేరకు ప్రభావం చూపుతున్నదనే విషయాలపైన తాజా అధ్యయనంలో వివరించారు. సదరు అధ్యయనం ప్రకారం.. ఆస్ట్రాజెనెకా బూస్టర్ డోస్.. ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు బీటా, డెల్టా, గామా, ఆల్ఫా వేరియంట్స్‌ను సక్సెస్ ఫుల్‌గా ఎదుర్కొంటోంది.

    Also Read: ఏపీ సర్కారు నుంచి తదుపరి పిలుపు మోహన్ బాబుకే..?

    ఆస్ట్రాజెనెకా లేదా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్న వారిలో చక్కటి ఫలితాలు కనబడుతున్నట్లు పరిశోధకులు వివరిస్తున్నారు. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇప్పుడు మరో డోసు అనగా మూడో డోసు.. బూస్టర్ గా ఇవ్వడం ద్వారా మంచి ఉపయోగాలుంటున్నాయని అంటున్నారు. బూస్టర్ డోస్ ద్వారా ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవడానికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ గణనీయంగా పెరుగుతున్నదని చెప్తున్నారు.

    జనం కూడా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకునేందుకుగాను మొగ్గు చూపుతున్నారు. అయితే, బూస్టర్ డోస్ పంపిణీ ఇంకా అన్ని చోట్లా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. గతంతో పోల్చితే కొవిడ్ పై అవేర్ నెస్ ఇప్పుడు బాగా పెరిగిందని, అందుకే జనాలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు చాలా మందే ఉండగా, వారందరూ బూస్టర్ డోస్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే బూస్టర్ డోస్ తీసుకున్నా కానీ ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని వైద్యులు, పెద్దలు సూచిస్తున్నారు.

    Also Read: చైతులో పూర్తి మార్పుని చూస్తారు – నాగార్జున

    Tags