https://oktelugu.com/

Dil Raju: దిల్ రాజు అంటేనే అసలు వాడకానికి ప్రతి రూపం !

Dil raju:‘దిల్ రాజు’ సక్సెస్ వెనుక ప్రధాన కారణం.. టాలెంట్ పర్సన్స్ ను వెతికి పట్టుకుని వాళ్ళను తన కాంపౌండ్ లోనే అట్టి పెట్టుకోవడం. అందుకే, దిల్ రాజు బ్యానర్ లో కంటిన్యూగా ఎవరు పని చేస్తున్నాడు అంటూ నిర్మాతల ఆరా తీస్తూ ఉంటారు. కానీ, దిల్ రాజు తనకు పనికొచ్చే ఎవర్నీ అంత తేలిగ్గా వదిలిపెట్టడు. ప్రస్తుతం ‘దిల్‌’ రాజు తన తమ్ముడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ సినిమా రిలీజ్ పనుల్లో ఉన్నాడు. ఆశిష్‌ ‘రౌడీ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 14, 2022 / 11:52 AM IST
    Follow us on

    Dil raju:‘దిల్ రాజు’ సక్సెస్ వెనుక ప్రధాన కారణం.. టాలెంట్ పర్సన్స్ ను వెతికి పట్టుకుని వాళ్ళను తన కాంపౌండ్ లోనే అట్టి పెట్టుకోవడం. అందుకే, దిల్ రాజు బ్యానర్ లో కంటిన్యూగా ఎవరు పని చేస్తున్నాడు అంటూ నిర్మాతల ఆరా తీస్తూ ఉంటారు. కానీ, దిల్ రాజు తనకు పనికొచ్చే ఎవర్నీ అంత తేలిగ్గా వదిలిపెట్టడు. ప్రస్తుతం ‘దిల్‌’ రాజు తన తమ్ముడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ సినిమా రిలీజ్ పనుల్లో ఉన్నాడు.

    Dil Raju

    ఆశిష్‌ ‘రౌడీ బాయ్స్‌’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే, ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే.. బన్నీ, ప్రభాస్, చరణ్ వరకూ ఇలా అందర్నీ ఈ సినిమా కోసం వాడేశాడు. దిల్ రాజు అంటేనే అసలు వాడకానికి ప్రతి రూపం. మరోపక్క సాంకేతిక నిపుణులు కూడా దిల్ రాజు దగ్గర పని చేయడానికి తెగ ఉత్సాహ పడుతూ ఉంటారు.

    Also Read: పంజాబ్ లో సీఎం అభ్యర్థి ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణకు రెడీ

    వారి ఉత్సాహానికి తగ్గట్టుగానే దిల్ రాజు కూడా దొరికిన టాలెంట్ ను క్యాష్ చేసుకుంటూ ముందుకు పోతుంటాడు. అయితే, ఆ మధ్య ‘షాదీ ముబారక్’ అంటూ ఒక సినిమా విడుదల చేశాడు దిల్ రాజు. సినిమా బాగుంది అని మంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే, ఆ సినిమాలో మంచి విషయం ఉంది. అందుకే ఆ సినిమా దర్శకుడు పద్మశ్రీకి అడ్వాన్స్ ఇచ్చి తన అఫీస్ లో కూర్చోపెట్టాడు దిల్ రాజు.

    దిల్ రాజు ఇలాంటి డైరెక్టర్లను నలుగురు వరకు కుర్చోపెట్టాడు. అంటే.. కోట్లు ఖర్చుపెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేయడం కంటే.. టాలెంట్ ఉన్న కొత్త వాళ్లతో చిన్న సినిమాలు చేసి హిట్లు కొట్టడం తనకు ఎక్కువ లాభం అని దిల్ రాజు అనుభవపూర్వకంగా తెలుసుకున్న అంశం. అందుకే, అవకాశం దొరికినపుడుల్లా చిన్న సినిమాలు తీసుకుంటూ ముందుకు పోతున్నాడు. అయితే దర్శకుడు పద్మశ్రీ, దిల్ రాజు కోరిక మేరకు ఒక కథ రాశాడు. ఒక హీరోకి కథను చెప్పించారు.

    ఆ హీరో కూడా కథ బాగుంది చేద్దాం అంటున్నా.. 10 నెలల నుంచి ఆ సినిమా మాత్రం ముందుకు కదలడం లేదు. అప్పుడప్పుడు తానే చేసే చిన్న సినిమాలను బాగా లేట్ చేస్తుంటాడు దిల్ రాజు. పైగా ఆ సినిమాలో తనకు సాలిడ్ లాభాలు వస్తేనే ఆ సినిమాని స్పీడ్ గా సెట్స్ పైకి తీసుకువెళ్తాడు. లేదంటే.. మరో ఏడాది వరకు అలాగే ఎదురుచూస్తూ ఉండాలి.

    రౌడీ బాయ్స్‌’ దర్శకుడు హర్ష కొనుగంటి విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు దర్శకుడు పద్మశ్రీ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దిల్ రాజు మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొత్తానికి దిల్ రాజు కాంపౌండ్ లో మరో డైరెక్టర్ నలిగిపోతున్నాడు అన్నమాట.

    Also Read:  ఏపీ సర్కారు నుంచి తదుపరి పిలుపు మోహన్ బాబుకే..?

    Tags