Punjab CM: పంజాబ్ లో పాగా వేయాలని అమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఇందుకు గాను ప్రణాళికలు రచిస్తోంది. కొత్తదనానికి ఎప్పుడు ప్రాధాన్యం ఇచ్చే అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ఆసక్తికర చర్చకు తెర లేపారు. సీఎం అభ్యర్థిని ఓటర్లే నిర్ణయించుకుంటారని కొత్త పల్లవి అందుకున్నారు దీంతో రాజకీయాల్లోనే సంచలనం అవుతోంది. ఇన్నాళ్లు సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన ప్రజలను కొత్త మార్గంలో నడిపించేందుకు కేజ్రీవాల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు గాను కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే సర్వేలన్ని పంజాబ్ లో ఆప్ దే అధికారమని కుండ బద్దలు కొడుతన్న క్రమంలో కేజ్రీవాల్ కొత్త నినాదాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. పనులు అందరు చేస్తారు. కానీ ఆ పనిని ప్రత్యేకంగా చేయడంలోనే వారి పనితనం బయటపడుతుంది. అందరు ఎన్నికలను ఎదుర్కొన్న వారే. కానీ అందులో కొత్తదనానికి శ్రీకారం చుట్టే వారు ఎంత మంది? అంటే సమాధానం లేదు.
Also Read: ఏపీ సర్కారు నుంచి తదుపరి పిలుపు మోహన్ బాబుకే..?
అందరు మూస పద్ధతులకు అలవాటుపడిపోయారు. ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్నది అనే విధానమే ఇప్పటివరకు ప్రజల్లో ఉన్న నానుడి. కానీ దాన్ని పక్కనపెట్టి నేతల పనితనం మీదే ప్రధానంగా ఆధారపడి ఉంటుందని నిరూపించిన నేత కేజ్రీవాల్. పంజాబ్ లో సీఎంను ఎన్నుకునే బాధ్యత ప్రజల మీదే పెట్టి మరోమారు ఆయన ఆప్ ను ప్రజలకు దగ్గర చేస్తున్నారు. పంజాబ్ లో ఎలాగైనా అధికారం చేపట్టాలని చూస్తున్న పార్టీలకు సవాల్ విసురుతున్నారు.
సీఎం అభ్యర్థిని ఎన్నుకునే బాధ్యత ఓటర్ల మీద ఉంచడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రజలు తమ అభిప్రాయాలను ఈనెల 17లోగా తెలియజేయాలని కోరారు. దీంతో ప్రజలు కూడా తమ అభిప్రాయం తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం అభ్యర్థిని తామే ఎన్నుకోవడం ద్వారా జవాబుదారీ తనం ఉంటుందని తెలుస్తోంది. దీంతో పంజాబ్ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.
Also Read: ఒకే వేదికపైకి చిరంజీవి – రవితేజ.. ఆసక్తి రెట్టింపు అయింది !