
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ నిదానంగా జరుగుతోంది. ఆగష్టు నెల నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్నా వైరస్ సోకే అవకాశాలు తక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు వ్యాక్సిన్ తో అదనపు బలం చేకూరుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.
అమెరికాలోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధనలు చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు వ్యాక్సిన్ తీసుకుంటే ఇతర వైరస్ లు కూడా సోకే అవకాశాలు తగ్గుతాయని తెలుస్తోంది. కరోనా బాధితుల్లో యాంటీబాడీల ఉనికిని విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. కరోనా బాధితుల్లో యాంటీ బాడీల ఉనికిని విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.
ఆ తరువాత యాంటీబాడీల తీరుతెన్నులను పరిశీలించి కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో భిన్న రకాల యాంటీబాడీలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఈ యాంటీబాడీల వల్ల వైరస్ నుంచి మెరుగైన, దీర్ఘకాల రక్షణ క్రమంగా వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నా యాంటీబాడీలు భారీగా పెరుగుతున్నాయి.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు బ్రిటన్, న్యూయార్క్, దక్షిణాఫ్రికాలలో వెలుగు చూసిన వైరస్ ల నుంచి రక్షణ లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం వేగంగా వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది.