
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.