spot_img
Homeబిజినెస్Apple foldable iPhone CAD: యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్.. ఎలా ఉందో తెలిస్తే క్యూ...

Apple foldable iPhone CAD: యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్.. ఎలా ఉందో తెలిస్తే క్యూ కడతారు..

Apple foldable iPhone CAD: ప్రపంచవ్యాప్తంగా Apple ఫోన్లకు డిమాండ్ ఎప్పటికి ఉంటుంది. అందులోనూ భారత్లో యాపిల్ కంపెనీకి చెందిన iphone వస్తుందంటే క్యూలో నిలబడి మరీ కొంటారు. ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్ వరకు మార్కెట్లోకి వచ్చి అందరిని అలరించింది. త్వరలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ కూడా రాబోతుంది. అయితే ఈ ఫోన్లతో పాటు ఫోల్డబుల్ మొబైల్ కూడా రాబోతుంది. అయితే దీని విషయం యాపిల్ కంపెనీ అధికారికంగా చెప్పనప్పటికీ దీని గురించిన సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల చాలామంది ఫోల్డబుల్ ఫోన్లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కంపెనీలు ఇలాంటి మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. అయితే ఇప్పుడు యాపిల్ కంపెనీ కూడా దీనిని ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

సోనీ డిక్సన్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ప్రకారం.. ఐఫోన్ CAD పేరుతో foldable మొబైల్ కెమెరా, కవర్ డిస్ప్లే ఆకట్టుకునే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని వెనుక వైపు 17 ప్రో లాంటి డిజైన్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కెమెరా ఐలాండ్ కింద ప్రత్యేకంగా గ్లాసెస్ ను సెట్ చేశారు.. దానితోపాటు ఆపిల్ లోగో కనిపిస్తుంది. ఇందులో రియల్ కెమెరా ఉండగా.. ఈ కెమెరా సమాంతర ఆకారంలో ఉన్నట్లు తెలుస్తోంది. LED ఫ్లాష్ తో పాటు USB type C ఉండనుంది. అలాగే పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్ కుడివైపు కనిపిస్తాయి. అలాగే ఇందులో A 20 ప్రో చిప్ సెట్ ద్వారా రాసి సర్ పనిచేస్తుంది ఇందులో 7.8 అంగుళాల foldable డిస్ప్లే ఉండనుంది. ఇది 5.3 అంగుళాల కవర్ డిస్ప్లే కలిగి ఉంటుంది. డ్యూయల్ కెమెరాలు ఉండే వీటిలో 48 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే ఈ మొబైల్ మొత్తం టైటానియం, అల్యూమినియంతో నిర్మించాలని తెలుస్తోంది. ఇది చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది.

కెమెరా పనితీరుతో పాటు బ్యాటరీ కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉన్న ఈ ఫోన్ కు మార్కెట్లో డిమాండ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఫ్రంట్ కెమెరా, వీడియో కాలింగ్ కోసం ఇందులో కావలసిన మెగాపిక్సల్ ను పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే డిమాండ్ ఉన్న యాపిల్ ఫోన్ లకు ఈ ఫోల్డబుల్ మొబైల్ ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version