https://oktelugu.com/

కరోనాకు సాధారణ జ్వరానికి తేడాలు ఇవే.. ఏ విధంగా గుర్తించాలంటే?

గత కొన్నిరోజుల నుంచి వాతావరణంలో ఊహించని స్థాయిలో మార్పులు చోటు చేసుకోవడంతో జ్వరం బారిన పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చలిగాలులు వణికిస్తూ ఉండటంతో చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలతో ఎక్కువమంది బాధ పడుతున్నారు. చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణమని వైద్యులు సైతం చెబుతున్నారు. అయితే సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు, కరోనా వైరస్ లక్షణాలు ఒకే విధంగా ఉండటంతో చాలామందికి ఏది సాధారణ జ్వరమో, ఏది కరోనానో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 24, 2022 / 07:08 PM IST
    Follow us on

    గత కొన్నిరోజుల నుంచి వాతావరణంలో ఊహించని స్థాయిలో మార్పులు చోటు చేసుకోవడంతో జ్వరం బారిన పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చలిగాలులు వణికిస్తూ ఉండటంతో చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలతో ఎక్కువమంది బాధ పడుతున్నారు. చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణమని వైద్యులు సైతం చెబుతున్నారు.

    అయితే సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు, కరోనా వైరస్ లక్షణాలు ఒకే విధంగా ఉండటంతో చాలామందికి ఏది సాధారణ జ్వరమో, ఏది కరోనానో అర్థం కావడం లేదు. అయితే వైద్య నిపుణులు జ్వరంతో పాటు దగ్గు, జలుబు ఇతర లక్షణాలు ఉంటే కరోనా కావచ్చని జ్వరం లేకుండా ఇతర లక్షణాలు ఉంటే మాత్రం కరోనా అయ్యే అవకాశం తక్కువని వెల్లడిస్తున్నారు. డెల్టా వేరియంట్ సోకిన సమయంలో చాలామంది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఇబ్బందులు పడ్డారు.

    అయితే ఒమిక్రాన్ లక్షణాలు డెల్టా వేరియంట్ తో పోల్చి చూస్తే భిన్నంగా ఉండటం గమనార్హం. జ్వరం రెండు మూడు రోజులకు మించి కొనసాగితే కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం లేకుండా ఇతర లక్షణాలు ఉంటే వైద్యుల సూచనల ప్రకారం మందులను తీసుకుంటే సరిపోతుంది. ఉప్పునీళ్లు పక్కిలించడం, ఆవిరి పట్టడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.

    చల్లార్చిన నీళ్లను తాగడం, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం, వేడి ఆహారం తీసుకోవడం ద్వారా కూడా కొన్ని ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో పాటు ఈ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు.