https://oktelugu.com/

హైద‌రాబాద్ బీడీఎల్‌లో 82 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 82 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు 57 ఉండగా టెక్నీషియ‌న్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు 25 ఉండటం గమనార్హం. ఇంజినీరింగ్‌, ఈఈఈ, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌ లేదా మెకానిక‌ల్, సీఎస్ఈ, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 24, 2022 / 07:11 PM IST
    Follow us on

    భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 82 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు 57 ఉండగా టెక్నీషియ‌న్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలు 25 ఉండటం గమనార్హం.

    ఇంజినీరింగ్‌, ఈఈఈ, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌ లేదా మెకానిక‌ల్, సీఎస్ఈ, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ బ్రాంచ్ లలో చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. డిగ్రీ, డిప్లొమా ఇంజినీరింగ్ పూర్తి చేసిన వాళ్లు కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    రాత ప‌రీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి తుది ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ నెల 19వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2022 సంవత్సరం జనవరి 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని చెప్పవచ్చు.

    అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. https://bdl-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.