కరోనా నుంచి కోలుకున్నారా.. తీసుకోవాల్సిన ఆహారం ఇదే..?

మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, జబ్బుల నుంచి త్వరగా కోలుకోవాలన్నా తీసుకునే ఆహారం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. పోషకాహారం తీసుకుంటే మాత్రమే కోలుకున్న తర్వాత మునుపటి సత్తువను పొందడం సాధ్యమవుతుంది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా జబ్బుల నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరోనా వైరస్ శరీరంలో గ్లూకోజ్, ప్రోటీన్ ను వినియోగించుకుంటూ చాలామందిని బలహీనులుగా మారుస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం పుట్టుకొచ్చే వాపు ప్రక్రియ సైతం ఎముకలు, కండరాలను దెబ్బ తీస్తుండటం […]

Written By: Navya, Updated On : June 22, 2021 9:31 am
Follow us on

మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, జబ్బుల నుంచి త్వరగా కోలుకోవాలన్నా తీసుకునే ఆహారం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. పోషకాహారం తీసుకుంటే మాత్రమే కోలుకున్న తర్వాత మునుపటి సత్తువను పొందడం సాధ్యమవుతుంది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా జబ్బుల నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరోనా వైరస్ శరీరంలో గ్లూకోజ్, ప్రోటీన్ ను వినియోగించుకుంటూ చాలామందిని బలహీనులుగా మారుస్తోంది.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం పుట్టుకొచ్చే వాపు ప్రక్రియ సైతం ఎముకలు, కండరాలను దెబ్బ తీస్తుండటం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందిని నీరసం, నిస్సత్తువ ఆవహిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు కనీసం మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా లేదా శరీరానికి అవసరమైన పోషకాలు లభించకపోయినా కోలుకోవడం ఆలస్యమవుతుంది.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఎక్కువమంది మాంసం, గుడ్లకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్రోటీన్లు, కొవ్వులు, పిండిపదార్థాలు ఉన్న సమతులాహారం తీసుకుంటే మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. కంది, శనగ, మినప, పెసర, పిస్తా, జీడిపప్పు, బాదం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు లభిస్తాయి.

చిరుధాన్యాలు, పొట్టుతో కూడిన ఓట్స్, పాలిష్ పట్టని గోధుమలు, దంపుడు బియ్యం వల్ల శరీరానికి అవసరమైన పిండి పదార్థం లభిస్తుంది. పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవడం ద్వారా శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు మంచిది.