దేశంలో డయాబెటిస్ సమస్యతో బాధపడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువమంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ బారిన పడిన వాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధిస్తున్నాయి. ఆహారం నుంచి జీవన విధానం వరకు అనేక విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే మాత్రమే షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది.
ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే షుగర్ లెవెల్స్ మరింత పెరిగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు సైతం ఉంటాయని చెప్పవచ్చు. వెల్లుల్లి డయాబెటిస్ సమస్యకు సులభంగా చెక్ పెడుతుందని ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడంలో వెల్లుల్లి సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
షుగర్ తో బాధ పడేవాళ్లు ప్రతిరోజు వెల్లుల్లితో కూడిన ఆహారాన్ని, లేదా పానీయాలను తయారు చేసుకుని తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వెల్లుల్లి రెబ్బలు తినడం లేదా గోరువెచ్చని నీళ్లలో వెల్లుల్లిని మెత్తగా నూరి తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. వెల్లుల్లి రసంలో ఉల్లి రసం, నిమ్మ రసం, అల్లం రసం కలిపి ఈ మిశ్రమాన్ని ఉడికించి అందులో తేనె కలుపుకుని తాగితే మంచిది.
వెల్లుల్లి రసం వల్ల హార్ట్ బ్లాక్ వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. రాత్రంతా వెల్లుల్లి నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే శరీరం వేడి చేసి ఉంటే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది.