కరోనా నుంచి కోలుకున్నారా.. వాటిని పారేయాల్సిందే..?

గతంలో ఏ వైరస్ విజృంభించని స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవడంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇబ్బందులు పడక తప్పదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు నూటికి నూరు శాతం రక్షణ ఇవ్వలేవని నిపుణులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లతో పాటు వైరస్ నుంచి కోలుకున్న వాళ్లు కొన్ని జాగ్రత్తలను […]

Written By: Navya, Updated On : May 8, 2021 3:01 pm
Follow us on


గతంలో ఏ వైరస్ విజృంభించని స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవడంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇబ్బందులు పడక తప్పదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు నూటికి నూరు శాతం రక్షణ ఇవ్వలేవని నిపుణులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

అందువల్ల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లతో పాటు వైరస్ నుంచి కోలుకున్న వాళ్లు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ ను మార్చాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. కరోనా సోకకముందు వినియోగించిన టూత్ బ్రష్ లను మళ్లీ వినియోగిస్తే వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తుండటం గమనార్హం.

బ్రష్ లు, టంగ్ క్లీనర్ల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని అందువల్ల కరోనా బాధితులు తప్పనిసరిగా వాటిని పారేస్తే మంచిదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా వైరస్ ముక్కు లేదా నోటి నుంచి శరీరంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుందో కరోనా సోకిన వ్యక్తి బ్రష్ చేసిన సమయంలో అదే విధంగా వ్యాప్తి చెందుతుంది. ఇంట్లో ఎవరికైతే కరోనా సోకుతుందో ఆ వ్యక్తి తప్పనిసరిగా టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ లను మార్చాల్సి ఉంటుంది.

మరోవైపు కరోనా థర్డ్ వేవ్ కు సంబంధించి వస్తున్న వార్తలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే థర్డ్ వేవ్ రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.