ప్రపంచ దేశాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ప్రజల్లో భయాన్ని అంతకంతకూ పెంచుతోంది. కరోనాతో కోలుకున్న వాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఎవరైతే కరోనా నుంచి కోలుకున్నారో వారికి కరోనా వైరస్ వల్ల కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. వైరస్ వల్ల ఇప్పటికే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉండటం గమనార్హం. అయితే తాజాగా కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు కంటిచూపు పోయింది.
ఒక ఫంగస్ వల్ల కరోనా నుంచి కోలుకున్న వాళ్లు కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో ఏకంగా 8 మంది కరోనా నుంచి కోలుకున్న తరువాత కంటిచూపును పోగొట్టుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 40 మంది ఈ ఫంగస్ బారిన పడినట్లు తెలుస్తోంది. బ్లాక్ ఫంగస్ వల్ల సూరత్ లో 8 మంది బాధితులకు కంటిచూపు పోయినట్టు వైద్యనిపుణులు గుర్తించారు. వైరస్ పై శాస్త్రవేత్తలు, వైద్యులు అధ్యయనం చేస్తున్నారు.
ఈ ఫంగస్ ప్రాణాంతకమని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. ఈఎన్‌టీ విభాగం అధిపతి డాక్టర్ అజయ్ స్వరూప్ కరోనా బాధితుల్లో ఎక్కువమంది షుగర్ రోగులు ఉన్నారని చెబుతున్నారు. కరోనా నివారణకు తీసుకున్న ఔషధాల వల్ల వాళ్లు ఈ ఫంగస్ బారిన పడుతున్నారని వెల్లడించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు ఈ ఫంగస్ బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
మధుమేహం, కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ బాధితులు కరోనా సోకితే అప్రమత్తంగా ఉండాలి. ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.