https://oktelugu.com/

కరోనా వైరస్ గురించి అపోహలు, వాస్తవాలు ఇవే..?

కరోనా సెకండ్ వేవ్ లో భారీగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కరోనా గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తల్లో కొన్ని వార్తలు నిజాలు కాగా మరికొన్ని వార్తల్లో మాత్రం ఏ మాత్రం నిజం లేకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో ఆల్కహాల్ తీసుకుంటే కరోనా సోకదని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటంటే ఆల్కహాల్ ఆరోగ్య సమస్యలను రెండింతలు చేస్తుంది. ఆల్కహాల్‌ తీసుకోవడం ఎప్పటికీ ప్రమాదకరమే కాబట్టి ఆల్కహాల్ కు […]

Written By: Kusuma Aggunna, Updated On : April 29, 2021 3:35 pm
Follow us on

కరోనా సెకండ్ వేవ్ లో భారీగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కరోనా గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తల్లో కొన్ని వార్తలు నిజాలు కాగా మరికొన్ని వార్తల్లో మాత్రం ఏ మాత్రం నిజం లేకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో ఆల్కహాల్ తీసుకుంటే కరోనా సోకదని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటంటే ఆల్కహాల్ ఆరోగ్య సమస్యలను రెండింతలు చేస్తుంది.

ఆల్కహాల్‌ తీసుకోవడం ఎప్పటికీ ప్రమాదకరమే కాబట్టి ఆల్కహాల్ కు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. శ్వాస సంబంధిత వ్యాయామాల ద్వారా కరోనా సోకిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటంటే ల్యాబ్‌ పరీక్షల ద్వారా మాత్రమే కరోనా ఉందో లేదో నిర్ధారించవచ్చు. 10 సెకండ్లు శ్వాస బిగబట్టి ఉంచగలిగితే కరోనా రానట్టేనని అనుకుంటే పొరబడినట్లేనని చెప్పవచ్చు.

బూట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతుండగా బూట్ల ద్వారా కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉన్నా బూట్లను ఇంటి బయటే వదిలేయడం మంచిది. పసుపు తింటే ఆరోగ్యానికి మంచిది కాగా పసుపు తిన్నంత మాత్రాన కరోనా రాదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా సోకకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

ఏ మాత్రం నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించినా కరోనా బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.