కరోనా సోకకుండా ఉండాలంటే.. ఇలా చేయండి !

సినిమాల షూటింగ్స్ మళ్ళీ ఆగిపోయాయి, సినీ కార్మికులకు మళ్ళీ పని లేకుండా పోయింది. అయితే షూటింగ్స్ ను తిరిగి స్టార్ట్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మధ్యలో షూటింగ్ లను ఆపేసుకుని, నష్టపోవాల్సిన అవసరం లేదని.. కరోనాను నివారించుకునే పద్ధతులు ఉన్నాయని లవ్ స్టోరీ బృందం చెప్పుకొస్తోంది. ఇంతకీ లవ్ స్టోరీ బృందంలో కరోనా స్పెషలిస్ట్ లు ఏమైనా ఉన్నారా అని మీరు డౌట్ పడక్కర్లేదు. కాకపోతే కరోనా సోకకుండా షూటింగ్ చేయడంలో వాళ్ళు అనుభవం పొందారు. […]

Written By: admin, Updated On : April 29, 2021 5:14 pm
Follow us on

సినిమాల షూటింగ్స్ మళ్ళీ ఆగిపోయాయి, సినీ కార్మికులకు మళ్ళీ పని లేకుండా పోయింది. అయితే షూటింగ్స్ ను తిరిగి స్టార్ట్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మధ్యలో షూటింగ్ లను ఆపేసుకుని, నష్టపోవాల్సిన అవసరం లేదని.. కరోనాను నివారించుకునే పద్ధతులు ఉన్నాయని లవ్ స్టోరీ బృందం చెప్పుకొస్తోంది. ఇంతకీ లవ్ స్టోరీ బృందంలో కరోనా స్పెషలిస్ట్ లు ఏమైనా ఉన్నారా అని మీరు డౌట్ పడక్కర్లేదు.

కాకపోతే కరోనా సోకకుండా షూటింగ్ చేయడంలో వాళ్ళు అనుభవం పొందారు. వాళ్లకు ఆ విషయంలో పరిణితి ఉంది. అందుకే మిగిలిన సినిమా వాళ్లకు తమకు తెలిసిన విషయాలను చెబుతూ..కొన్ని టిప్స్ చెప్పారు. వాటిల్లో ముఖ్యమైనది ‘షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి రెండు రోజుల ముందే ఆర్టీపీసీఆర్ విధానంలో కరోనా టెస్ట్ లు చేయాలి. ఈ టెస్ట్ లలో ఎలాంటి రిమార్క్ లు రాకుండా ఉండాలంటే.. టెస్ట్ లు చేసే వారికి టెస్ట్ లు చేయడంలో అనుభవం ఉండేలా చూసుకోండి.

ఇక టెస్ట్ ల ఫలితంలో నెగిటివ్ వచ్చిన వారినే షూటింగ్ కి అనుమతించండి. అలాగే షూటింగ్ ప్లేస్ ల్లో యూనిట్ సభ్యులందరూ శానిటైజర్లు, మాస్కులతో పాటు ఫేస్ షీల్డ్ లు కూడా ధరించేలా జాగ్రత్తలు తీసుకుండి. ఇక ఎవరి పనులను వాళ్ళే చేసుకునేలా కేర్ తీసుకోండి. ముఖ్యంగా ఆహార పదార్ధాల విషయంలో సెల్ఫ్ సర్వీస్ పెట్టుకోవాలి. అది హీరో అయినా హీరోయిన్ అయినా సరే. ఎవరి ఆహారాన్ని వారే తెచ్చుకోవడం వల్ల సగం భయం పోయినట్టే.

అలాగే సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ గుడ్లు, పాలు, పండ్లు తినేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక యూనిట్ లో ఉన్న ప్రతి వ్యక్తికీ కొవిడ్ ఇన్యూరెన్స్ చేయించాలి” అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు. లవ్ స్టోరీ షూటింగ్ తాము అలాగే చేశామని అందుకే మాకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ముఖ్యంగా కరోనా సోకకుండా మా షూట్ ను పూర్తి చేశామని.. మిగిలిన సినిమా బృందాలు కూడా ఇలాగే షూటింగ్ చేస్తే.. కరోనా సోకే అవకాశం చాల తక్కువ అని చెప్పుకొచ్చింది లవ్ స్టోరీ బృందం.

ఎలాగూ పుష్ప, ఆచార్య, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, మిగిలిన చిన్నాచితకా హీరోల సినిమాలు ఇలా చాలానే షూట్ కి రెడీగా ఉన్నాయి. పైగా ఈ సినిమాల షూటింగ్ లలో అనేక కరోనా కేసులు కూడా బయటపడ్డాయి. అందుకే షూట్ ను మధ్యలోనే ఆపారు. మరి లవ్ స్టోరీ బృందం చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీగా మళ్ళీ షూటింగ్ చేసుకోవచ్చు.