https://oktelugu.com/

కరోనా టీకాలపై జీఎస్టీ అవసరమా మోడీజీ?

ఓ వైపు కరోనాతో దేశ ప్రజల ప్రాణాలు పోతున్నాయి.. కరోనా మందులు, ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. మందులు, చికిత్సలు లేని ఈ మాయదారి రోగానికి వ్యాక్సిన్లు తప్ప మరో మార్గం లేదు. అయితే వ్యాక్సిన్ల కొరత ఇప్పుడు దేశాన్ని వెంటాడుతోంది. నిన్న 18 ఏళ్లకు పైబడిన వారికి టీకా వేసేందుకు పోర్టల్ ప్రారంభించగా క్రాష్ అయ్యింది. ఇక టీకాలపై కేంద్రం జీఎస్టీ వేయడంతో వాటి ధర రాష్ట్రాలకు రూ.300 -600, ఓపెన్ మార్కెట్ లో 600-1200గా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2021 / 11:47 AM IST
    Follow us on

    ఓ వైపు కరోనాతో దేశ ప్రజల ప్రాణాలు పోతున్నాయి.. కరోనా మందులు, ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. మందులు, చికిత్సలు లేని ఈ మాయదారి రోగానికి వ్యాక్సిన్లు తప్ప మరో మార్గం లేదు.

    అయితే వ్యాక్సిన్ల కొరత ఇప్పుడు దేశాన్ని వెంటాడుతోంది. నిన్న 18 ఏళ్లకు పైబడిన వారికి టీకా వేసేందుకు పోర్టల్ ప్రారంభించగా క్రాష్ అయ్యింది. ఇక టీకాలపై కేంద్రం జీఎస్టీ వేయడంతో వాటి ధర రాష్ట్రాలకు రూ.300 -600, ఓపెన్ మార్కెట్ లో 600-1200గా రెండు వ్యాక్సిన్ కంపెనీలు ప్రకటించాయి.

    అయితే కేంద్రానికి మాత్రం ఇవే కంపెనీలు రూ.150కే వ్యాక్సిన్ ను ఇస్తున్నాయి. అయినా తమకు లాభమే అంటున్నాయి. ఓపెన్ మార్కెట్ కు వచ్చేసరికి ధరలు అమాంతం పెరిగాయి.

    అదే రూ.150 చొప్పున బయట మార్కెట్ లో ఇస్తే దేశ ప్రజలంతా వేసుకొని కరోనానుంచి రక్షణ పొందేవారే.కానీ జీఎస్టీ పన్నులు, కంపెనీలకు లాభాల పేరిట సవాలక్ష బంధనాలు వ్యాక్సిన్ ధరలకు రెక్కలొచ్చాయి.

    ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ కరోనా వ్యాక్సిన్ల ధరలు ఇంత భారీగా ఉండడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. అందుకే నష్టనివారణ చర్యల దిశగా ఆలోచిస్తోంది. కంపెనీలను ధరలు తగ్గించాలని కోరగా సీరం సంస్థ రూ.100 తగ్గించింది. భారత్ బయోటెక్ స్పందించలేదు.

    అయితే ధరలను తగ్గించాలని కంపెనీలను కోరే బదులు కేంద్రం వ్యాక్సిన్లపై విధిస్తున్న జీఎస్టీని ఎత్తివేసి వాటిని మరింత చీప్ గా ప్రజలకు దొరికేలా చేయవచ్చు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం మాత్రం వ్యాక్సిన్లపై భరించకుండా ప్రజలపై భారం వేస్తారా? అని పలువురు వాదిస్తున్నారు.