కరోనా వ్యాక్సిన్ ధృవపత్రంలో తప్పులున్నాయా.. ఏం చేయాలంటే..?

దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 80 శాతం మంది ప్రజలకు వ్యాక్సినేషన్ జరిగేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొంతమంది కరోనా వ్యాక్సిన్ ధృవపత్రంలో పేరు, ఇతర వివరాలు తప్పుగా రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా […]

Written By: Navya, Updated On : June 9, 2021 2:59 pm
Follow us on

దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 80 శాతం మంది ప్రజలకు వ్యాక్సినేషన్ జరిగేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొంతమంది కరోనా వ్యాక్సిన్ ధృవపత్రంలో పేరు, ఇతర వివరాలు తప్పుగా రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.

కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో వివరాలు తప్పుగా వచ్చిన వాళ్లు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొవిన్ వెబ్ సైట్ ద్వారా తప్పుగా ఉన్న వివరాలను సరి చేసుకునే అవకాశం కల్పించడం గమనార్హం. వ్యాక్సిన్ ధృవపత్రంలో పేరు, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలను సులభంగా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆరోగ్య సేతు ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించడం గమనార్హం.

ధృవపత్రాల్లో తప్పులు సరి చేసుకోవాలని భావించే వాళ్లు మొదట www.cowin.gov.in పోర్టల్ ను ఓపెన్ చేసి పది అంకెల మొబైల్ నంబర్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది.మొబైల్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి పాస్ వర్డ్ ను వెరిఫై చేస్తే ఖాతా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అకౌంట్ డిటైల్స్ అనే ఆప్షన్ ను ఓపెన్ చేసే రైజ్ ఆన్ ఇష్యూ అనే బటన్ ను క్లిక్ చేయాలి.

ఆ తరువాత కరెక్షన్ ఇన్ సర్టిఫికెట్ ఆప్షన్ కనిపిస్తుంది. నచ్చిన విధంగా ఆ సర్టిఫికెట్ లో మార్పులు చేసుకోవచ్చు. అయితే ఒకసారి మాత్రమే ఈ విధంగా ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తరువాత అప్ డేట్ అయిన సమాచారం అందులో కనిపిస్తుంది.