https://oktelugu.com/

పోస్టర్ తో ఆసక్తి పెంచిన ‘డియర్ మేఘ’ !

‘డియర్ మేఘ’ అంటూ ‘మేఘా ఆకాష్’, ‘అరుణ్ ఆదిత్’ హీరోహీరోయిన్లుగా ఒక సినిమా వస్తోంది. అయితే, హీరో అరుణ్ ఆదిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. పోస్టర్ లో మేఘ ఆకాష్ లుక్స్ అండ్ పక్కన అరుణ్ ఆదిత్ స్టిల్ మొత్తానికి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మేఘా, అరుణ్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా హైలైట్ అయింది. ఇక ఈ సినిమాలో ‘అర్జున్ సోమయాజులు’ కూడా ఓ […]

Written By:
  • admin
  • , Updated On : June 9, 2021 / 02:57 PM IST
    Follow us on

    ‘డియర్ మేఘ’ అంటూ ‘మేఘా ఆకాష్’, ‘అరుణ్ ఆదిత్’ హీరోహీరోయిన్లుగా ఒక సినిమా వస్తోంది. అయితే, హీరో అరుణ్ ఆదిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. పోస్టర్ లో మేఘ ఆకాష్ లుక్స్ అండ్ పక్కన అరుణ్ ఆదిత్ స్టిల్ మొత్తానికి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

    మేఘా, అరుణ్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా హైలైట్ అయింది. ఇక ఈ సినిమాలో ‘అర్జున్ సోమయాజులు’ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏది ఏమైనా సింగిల్ పోస్టర్ తో ”డియర్ మేఘ” సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నిర్మాత అర్జున్ దాస్యం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

    అన్నట్టు ఈ సినిమా ఓటీటీ వేదికపై విడుదల కాబోతుంది. ఓ వినూత్నమైన నేపథ్యంలో సాగే అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా ఈ ‘డియర్ మేఘ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా చాలా బాగా వచ్చింది అని, ఈ సినిమాని ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంతో ఉన్నామంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నారు.

    ఇక అరుణ్ ఆదిత్ ‘గరుడ వేగ’ వంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. అలాగే మేఘ ఆకాష్ కూడా మంచి నటి అని ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది. కానీ అమ్మడుకు ఇంతవరకు సరైన సక్సెస్ మాత్రం రాలేదు.