దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందడంతో పాటు వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. మనం ఏ కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నా ఆ వ్యాక్సిన్ శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ పై ఆధారపడి ఉంటుందనే సంగతి తెలిసిందే. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే మాత్రమే ఏ వ్యాక్సిన్ అయినా సమర్థవంతంగా పని చేస్తుంది.
కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మనం రోగనిరోధక శక్తిని సులభంగా పెంచుకోవడంతో పాటు కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసేలా జాగ్రత్త పడవచ్చు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి కొన్నిరోజుల ముందు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. మద్యం తీసుకుంటే శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా వ్యాక్సిన్ వాటిని నిరోధించడంలో విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి.
కరోనా వ్యాక్సిన్ వేయించుకునే ముందు, వేయించుకున్న తరువాత మానసిక ఒత్తిడికి గురి కాకూడదు. మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది. కోడిగుడ్లు, వేరుశనగలు, పిస్తా, బాదం, జీడిపప్పు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాలు ఉంటాయి.
వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు రోజుకు కచ్చితంగా 7 లేదా 8 గంటలు నిద్రపోవాలి. ఒకేసారి 7 నుంచి 8 గంటలు పడుకుంటే మంచిదని నిద్ర సమయంలో జరిగే జీవక్రియ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఉపకరిస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు వ్యాయామం చేస్తే ఇమ్యూనిటీ పవర్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.