https://oktelugu.com/

కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి పాటించాల్సిన చిట్కాలివే..?

ఈ మధ్య కాలంలో చాలామంది కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వాపోతున్నారు. చాలామంది చేసే చిన్నచిన్న తప్పుల వల్ల కరెంట్ బిల్లులు షాక్ కొట్టేలా వస్తున్నాయి. అయితే కొన్ని టెక్నిక్స్ వాడటం వల్ల సులభంగా కరెంట్ బిల్లును తగ్గించుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలను సరైన పద్ధతిలో వాడటం వల్ల కరెంట్ బిల్లులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో గీజర్ ఉన్నవాళ్లు గీజర్ ను ఒక్కొక్కరు ఒక్కోసారి ఆన్ చేయకుండా కుటుంబ సభ్యులంతా ఒకరి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 21, 2021 10:21 am
    Follow us on

    ఈ మధ్య కాలంలో చాలామంది కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వాపోతున్నారు. చాలామంది చేసే చిన్నచిన్న తప్పుల వల్ల కరెంట్ బిల్లులు షాక్ కొట్టేలా వస్తున్నాయి. అయితే కొన్ని టెక్నిక్స్ వాడటం వల్ల సులభంగా కరెంట్ బిల్లును తగ్గించుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలను సరైన పద్ధతిలో వాడటం వల్ల కరెంట్ బిల్లులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

    ఇంట్లో గీజర్ ఉన్నవాళ్లు గీజర్ ను ఒక్కొక్కరు ఒక్కోసారి ఆన్ చేయకుండా కుటుంబ సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసేలా అలవాటు చేసుకోవాలి. రెండు స్నానాల గదులు ఉంటే ఒకే గీజర్ నీటిని వాడుకునే విధంగా ప్లంబింగ్ చేయించుకుంటే మంచిది. ఏసీని వాడేవాళ్లలో చాలామంది గది త్వరగా కూల్ కావాలని 18 డిగ్రీల టెంపరేచర్ సెట్ చేసుకుంటారు. అయితే టెంపరేచర్ 24 – 26 మధ్య ఉండేలా సెట్ చేసుకుంటే కరెంట్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.

    స్మార్ట్ ఫ్రిజ్ ను వినియోగిస్తే కరెంట్ బిల్లు తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. వాషింగ్ మెషీన్ లో లోడ్ కు మించి బట్టలు వేయకూడదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మిషన్ సరిగ్గా పని చేస్తుందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. మైక్రో ఓవెన్ వాడేవాళ్లు వంటకాన్ని బట్టి టైమ్ ను సెట్ చేసుకోవాలి. ఒకసారి మైక్రో ఓవెన్ ను ఆన్ చేశాక తరచూ తెరిచి చూడకూడదు.

    ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా కరెంట్ బిల్లు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. విద్యుత్ ఉపకరణాలను అవసరం ఉన్న సమయంలో మాత్రమే వినియోగించుకోవడం వల్ల బిల్లును తగ్గించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.