https://oktelugu.com/

దేశంలో 166కి చేరిన కరోనా కేసులు

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య బుధవారం 166కి చేరుకుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 14 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని , ప్రజలు మరింతగా పాటించాల్సిన వైద్య సామాజికపరమైన జాగ్రత్తలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెలువరించింది. కరోనాతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్రలలో ఒక్కొక్కరు మృతి చెందారు. వచ్చే 15 రోజులు కరోనా మహమ్మారికి సంబంధించి అత్యంత కీలకమైన రోజులని, ప్రజలంతా కూడా అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉందని కేంద్ర […]

Written By: , Updated On : March 19, 2020 / 10:20 AM IST
Follow us on

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య బుధవారం 166కి చేరుకుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 14 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని , ప్రజలు మరింతగా పాటించాల్సిన వైద్య సామాజికపరమైన జాగ్రత్తలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెలువరించింది.

కరోనాతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్రలలో ఒక్కొక్కరు మృతి చెందారు. వచ్చే 15 రోజులు కరోనా మహమ్మారికి సంబంధించి అత్యంత కీలకమైన రోజులని, ప్రజలంతా కూడా అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన వైద్య విభాగం పూర్తిస్థాయి మార్గదర్శకాలను వెలువరించింది.

నెలరోజుల పాటు విమాన ప్రయాణాలను మానుకోవాలి, దూర ప్రాంతాలకు రైలు, బస్సు నౌకల ప్రయాణాలను నిలిపివేసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను పెట్టుకోవద్దు. దూర ప్రయాణాలు ప్రత్యేకించి ఎక్కువ మంది జనం ప్రయాణించే రైళ్లలో దూర ప్రాంత ప్రయాణాలలోనే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదముందని హెచ్చరించారు.

కరోనాతో ఉత్తరప్రదేశ్‌లో 1 నుంచి 8వ తరగతి వరకూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోషన్ కల్పించారు. వారిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకూ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనాతో వచ్చే నెల వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో ఈ మధ్యకాలంలో పరీక్షలు జరిగినట్లుగానే పరిగణించి వారిని పై తరగతుల్లోకి పంపిస్తున్నట్లు తెలిపారు.

కోవిడ్ ప్రభావంతో ఎప్పుడూ రద్దీగా ఉండే బెంగళూరు టెక్ హబ్ ప్రాంతం ఇప్పుడు బోసిపోయింది. ఉద్యోగులు అతి తక్కువ సంఖ్యలో విధులకు హాజరు అవుతున్నారు. అత్యధికులు వర్క్ ఫ్రమ్ హోంను ఆశ్రయించారు.

ఇన్ఫోసిస్, విప్రో ఇతర ప్రముఖ ఐటి కంపెనీలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతి కల్పించారు. దీనితో కార్యాలయాల వద్ద రద్దీ తగ్గింది. పలు కూడళ్లు, ప్రముఖ రెస్టారెంట్లు మూతపడ్డాయి.

దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 43 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పుణే, ముంబైలకు చెందిన మహిళలిద్దరికి కరోనా సోకినట్లు బుధవారం నిర్థారణ అయింది. నెదర్లాండ్ నుంచి దుబాయ్ మీదుగా విమానంలో వచ్చిన 28 ఏండ్ల యువతికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వెల్లడైంది.

విదేశాలలో ఉంటున్న 276 మంది భారతీయులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. ఈ ఇరాన్‌లో ఉంటున్న భారతీయులకే అత్యధికంగా 256 మంది కరోనా బారిన పడ్డారు.

యుఎఇలో ఉంటున్న 12 మందికి, ఇటలీలోని ఐదుగురికి ఈ వైరస్ సంక్రమించిందని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. ఇక శ్రీలంక, హాంగ్‌కాంగ్, కువైట్, రవాండాలో ఉంటున్న భారతీయులలో ఒక్కొక్కరికి చొప్పున ఈ వ్యాధి అంటుకుంది.

కాగా, భారతదేశపు సైన్యంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో సైనికాధికారులు అప్రమత్తమయ్యారు. పారామిలిటరీ సిబ్బందికి సాధారణ సెలవులు రద్దు చేశారు. నాలుగు పేజీల మార్గదర్శకాలలో సైనిక సిబ్బంది జాగరూకతతో ఉండాలని, యుద్ధ ప్రాతిపదికన తమ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవల్సి ఉందని హెచ్చరించారు.

దాదాపు పదిలక్షల మందితో ఉండే సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్, ఐటిబిపి, ఎస్‌ఎస్‌బి, అసాంరైఫిల్స్, ఎన్‌ఎస్‌జి వంటి పలు భద్రతా బలగాల సిబ్బంది అత్యవసరమైతే తప్ప సెలవులు తీసుకోరాదని స్పష్టం చేశారు.