భారత్ లో రోజు రోజుకి కారోన వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చైనాలో పుట్టిన కారోన వైరస్ అతి తక్కువ సమయంలోనే యావత్ ప్రపంచాన్ని చుట్టేసి కోట్లమంది ప్రజలను భయపెడుతోంది. ఈ కారోన వైరస్ ని నియంత్రించే వ్యాక్సిన్ కోసం వివిధ దేశాల శాస్త్రవేత్తలు మల్ల గుల్లాలు పడుతున్నారు. వ్యాక్సిన్ మాట దేవుడెరుగు కనీసం వైరస్ ఎలా పుట్టిందో కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక అపోహలు, అసత్య, అవాస్తవ ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి గాలి వార్తలలో ఒకటి గోమూత్రం తాగితే కారోన రాదట.
అమెరికా, ఇశ్రాయేలు దేశాలు ఈ వైరస్ ని నియంత్రించే వ్యాక్సిన్ ని కనుగొనే పనిలో చాలా బిజీగా ఉంటే భారత్ లో కొంతమంది ఈ వైరస్ ని మన శరీరంలోనే చంపే సులువైన మార్గాన్ని కనుకొన్నారట. ఆవు మూత్రం తాగితే కారోన రాదట, ఒకవేళ వచ్చినా ఆవు మూత్రం తాగటం వల్ల అది మన శారీరంలోనే చనిపోతుందని కొంతమంది మూఢనమ్మక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశాన్ని 50సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ భారత మూఢనమ్మక సిద్ధాంతాలను ప్రజలలో రుద్దే ప్రయత్నం చేసే అపరమేధావులు పని గట్టుకొని మరీ ఈ గోమూత్ర పానియాన్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. దేశంలో మత రాజకీయాలు చేసే ఒక పార్టీ నేతలు కూడా ఈ గోమూత్ర ప్రచారంలో ఉండటం గమనార్హం.
నిజంగానే గోమూత్రంలో కరోనాని నియంత్రించే శక్తి ఉంటే ఆ మూత్రాన్ని పూణే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి పంపి కారోన పాజిటివ్ అని తేలిన కేసులలో ప్రయోగించి చూడమని చెప్పండి, మంచి ఫలితాలను ఇస్తే యావత్ ప్రపంచానికి అంతకంటే శుభవార్త మరొకటి ఉండదు. అంతేగాని ఇలా అసత్య, అవాస్తవ గాలి వార్తలన్ని ప్రచారం చేసి అమాయక ప్రజలను మోసం చేయొద్దని కొంతమంది వైద్యులు సలహాలు ఇస్తున్నారు.
