వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే కరోనా వైరస్ సోకదా..?

కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కరోనా వైరస్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఎవరైతే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారో వాళ్లు వైరస్ బారిన పడినా స్వల్ప చికిత్సతోనే కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లలో మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందని తెలుస్తోంది. కరోనా […]

Written By: Navya, Updated On : May 10, 2021 10:11 am
Follow us on

కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కరోనా వైరస్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఎవరైతే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారో వాళ్లు వైరస్ బారిన పడినా స్వల్ప చికిత్సతోనే కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లలో మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందని తెలుస్తోంది.

కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నా త్వరగానే కోలుకుంటూ ఉండటం గమనార్హం. ఒకసారి కరోనా సోకిన వాళ్లు 5 శాతం లోపు రెండోసారి వైరస్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎవరైతే కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటారో వాళ్లలో సహజంగానే యాంటీబాడీలు డెవలప్ కావడం జరుగుతుంది. 60 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లకు మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిది. వైరస్ బారిన పడినా వీళ్లు త్వరగా కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయి. రెండు డోసులు తీసుకున్న వాళ్లలో చాలా తక్కువమంది మాత్రమే వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తే మాత్రమే వ్యాక్సిన్ల ద్వారా వచ్చే రక్షణను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది.

వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు కరోనా సోకి సీటీ స్కాన్ చేయించుకున్నా వారి ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయని తెలుస్తోంది. ఎవరైతే వ్యాక్సిన్ ను తీసుకోకుండాఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్లు వైరస్ బారిన పడి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందే పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది.