https://oktelugu.com/

కరోనా రాకుండా ఉండాలంటే వీటిని శుభ్రం చేయాల్సిందే.. అవేంటంటే..?

కరోనా వైరస్ విజృంభణ వల్ల మన వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల్లో చాలామంది ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే కరోనా విజృంభణ తగ్గే వరకు మనం ప్రతిరోజూ ఉపయోగించే కొన్ని వస్తువులను కూడా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. మనం రోజూ ఉపయోగించే మంచం, పరుపు, దుప్పటి, తలగడలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. మంచం, పరుపు, దుప్పటి, తలగడలను ప్రతిరోజూ శుభ్రం చేసుకుంటే మంచిది. మనం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 15, 2021 / 11:08 AM IST
    Follow us on

    కరోనా వైరస్ విజృంభణ వల్ల మన వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల్లో చాలామంది ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే కరోనా విజృంభణ తగ్గే వరకు మనం ప్రతిరోజూ ఉపయోగించే కొన్ని వస్తువులను కూడా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. మనం రోజూ ఉపయోగించే మంచం, పరుపు, దుప్పటి, తలగడలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.

    మంచం, పరుపు, దుప్పటి, తలగడలను ప్రతిరోజూ శుభ్రం చేసుకుంటే మంచిది. మనం రోజూ ఉపయోగించే వాటర్ బాటిల్ విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలను తీసుకోవాలి. యాంటి బాక్టీరియల్ సబ్బు, వేడినీటితో వాటర్ బాటిల్ ను కచ్చితంగా కడగాలి. బాక్టీరియాను చంపే గుణమున్న రాగి బాటిల్స్ ను వాడితే మంచిది. మనం ఉపయోగించే కంప్యూటర్ కీబోర్డ్ పై కూడా బోలెడన్ని క్రిములు ఉంటాయి.

    అందువల్ల సేఫ్ క్లీనర్ లేదా ఆల్కహాల్ తో కీ బోర్డ్ ను శుభ్రం చేసుకుంటే మంచిది. ఉంగరాల ద్వారా కూడా క్రిములు వ్యాప్తి చెందుతాయి కాబట్టి యాంటీ బాక్టీరియల్ సబ్బు, వేడినీరు, లేదా ఆభరణాలను శుభ్రం చేసుకుంటే మంచిది. వైరస్ వ్యాప్తికి కారణమయ్యే వాటిలో స్మార్ట్ ఫోన్ కూడా ఒకటి. స్మార్ట్ ఫోన్ ను ఆల్కహాల్ తో శుభ్రం చేసుకుంటే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై హానికారక బ్యాక్టీరియా, వైరస్ లను తొలగించవచ్చు.

    కాఫీ, టీ కప్పులను, వంట పాత్రలను వేడినీటితో శుభ్రం చేస్తే మంచిది. డోర్ హ్యాండిల్స్, బాత్ రూం సింక్ లను కూడా బ్యాక్టీరియల్ క్లీనర్ తో శుభ్రం చేస్తే మంచిది. రోజూ వాడే టూత్ బ్రష్ ను మౌత్ వాష్ లో నానబెట్టి శుభ్రం చేసుకోవాలి.