ఎంపీ రఘురామ అరెస్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్

కరోనా కల్లోలం వేళ వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం మీద జనసేనాని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇదే విధంగా నిన్న అరెస్ట్ చేశారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరెస్ట్ కు ఇది సమయం కాదని.. ముందు కోవిడ్ రోగులను కాపాడడంపై దృష్టి సారించాలని పవన్ వ్యాఖ్యానించారు. ఓవైపు ఏపీలో కరోనా విజృంభిస్తోందని.. ప్రభుత్వ యంత్రాంగంతో ప్రజలను రక్షించాల్సిన […]

Written By: NARESH, Updated On : May 15, 2021 3:35 pm
Follow us on

కరోనా కల్లోలం వేళ వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం మీద జనసేనాని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇదే విధంగా నిన్న అరెస్ట్ చేశారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరెస్ట్ కు ఇది సమయం కాదని.. ముందు కోవిడ్ రోగులను కాపాడడంపై దృష్టి సారించాలని పవన్ వ్యాఖ్యానించారు.

ఓవైపు ఏపీలో కరోనా విజృంభిస్తోందని.. ప్రభుత్వ యంత్రాంగంతో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం ఎంపీ రఘురామను అరెస్ట్ చేయడం ఏమాత్రం సమర్థనీయం అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న కారణంతో ఎంపీ రఘురామను అరెస్ట్ చేయడం ఏమాత్రం సమర్థింపు చర్య కాదని జనసేనాని తెలిపారు.

ఏపీలో ఓ పక్క ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లుకు తరలిస్తుండగా.. అవసరమైన మందు కోసం ఏపీలో పది షాపులు తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల బాధలపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. ఈ సమయంలో అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని పవన్ అన్నారు.

ఏపీలో వైద్య సేవలు అందక తెలంగాణ, పక్క రాష్ట్రాలకు వెళుతూ సరిహద్దుల్లో ఏపీ వాసులు చస్తుంటే జగన్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని పవన్ విమర్శించారు. వారిపై కంటే రఘురామ అరెస్ట్ నే ఇప్పుడు ముఖ్యమా? అని పవన్ నిలదీశారు. సొంత పార్టీ ఎంపీని అరెస్ట్ చేయడంపై చూపించిన శ్రద్ధ.. కోవిడ్ రోగులపై చూపించరా? అని పవన్ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ అన్నయ్య, జనసేన నేత నాగబాబును ఇదే రఘురామకృష్ణంరాజు గత ఎన్నికల్లో ఓడించాడు. అయితే పవన్ మాత్రం తాజాగా వైసీపీ రెబల్ ఎంపీకి మద్దతుగా ప్రకటన విడుదల చేయడం విశేషం.