Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు షాకింగ్ న్యూస్.. 20 శాతం మందిలో?

Corona Vaccine: శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కరోనా సోకకుండా ఉండాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లలో 20 శాతం మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని సమాచారం. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడంతో బూస్టర్ డోస్ ను తప్పనిసరి చేస్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భువనేశ్వర్ లోని పరిశోధనా విభాగం పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించింది. […]

Written By: Kusuma Aggunna, Updated On : September 13, 2021 11:55 am
Follow us on

Corona Vaccine: శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కరోనా సోకకుండా ఉండాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లలో 20 శాతం మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని సమాచారం. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడంతో బూస్టర్ డోస్ ను తప్పనిసరి చేస్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భువనేశ్వర్ లోని పరిశోధనా విభాగం పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ కు డైరెక్టర్ గా పని చేస్తున్న అజయ్ ఫరీదా శరీరంలో యాంటీబాడీల లెవెల్స్ 30వేల నుంచి 40వేల వరకు ఉంటే వీళ్లకు బూస్టర్ డోస్ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అజయ్ ఫరీదా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు 70 శాతం నుంచి 80 శాతం వరకు ప్రభావం చూపిస్తున్నాయని వెల్లడించారు.

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు బూస్టర్ డోసులకు అనుమతులు ఇవ్వలేదు. త్వరలోనే బూస్టర్ డోస్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతులు లభిస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మెజారిటీ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగే అవకాశాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది కూడా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైతే బూస్టర్ డోస్ కు అనుమతులు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. కరోనా వైరస్ గురించి, కరోనా వ్యాక్సిన్ గురించి వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ సోకే అవకాశాలు తగ్గుతాయి