
Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. మోనితను చంపారన్న నేరారోపణలతో కార్తీక్ ను జైలుకు పంపి కోర్టులో హాజరు పరచి విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు మోనిత దీప చేతిలో అడ్డంగా దొరికిపోయి దీపను వేడుకుంటుంది. ఈ విధంగా కోర్టులో వాదోపవాదనలు జరుగుతుండగా కోర్టు కాసేపు వాయిదా పడుతుంది. ఈ సమయంలో సౌందర్య కార్తీక్ కి భోజనం తీసుకువచ్చి తినమని కార్తీక్ ను బతిమాలుతుంది.
కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ మోనిత దీపను ఏం చేసిందో అని భయపడుతూ ఉంటాడు. అప్పుడు సౌందర్య నువ్వేం భయపడకు ధైర్యంగా ఉండు దీపకి ఏం కాదు అంటూ ధైర్యం చెబుతుంది. ఆ మాటలు విన్న ఆనందరావు మోనిత నిజ స్వరూపం తెలుసుకొని దీపను ఏం చేస్తుందో అని మనసులో కంగారు పడతాడు. కోర్టు విరామం తర్వాత కార్తీక్ ను మరోసారి బోనులోకి ప్రవేశపెడతారు. ఇలా బోన్ లో ఉన్న కార్తీక్ గతంలో దీప విషయంలో తాను చేసిన తప్పులను తను పెట్టిన బాధలను వివరిస్తాడు.
ఇక దీప మోనితకి గన్ గురిపెట్టి చంపుతానని బెదిరించడంతో మోనిత చంపద్దు అంటూ బ్రతిమాలింది. తన కడుపులో బిడ్డ ఉందని, అన్యాయంగా తన బిడ్డను చంపొద్దు అంటూ ఎమోషనల్గా ఏడవడంతో దీప వెనక్కి తగ్గుతుంది. దీపను చూసిన మోనిత ఇక తనను చంపదని భావించి అలాగే ఏడుస్తూ గతంలో నీ బిడ్డలు మాదిరిగా నా బిడ్డ కూడా ఒంటరి కాకూడదు అంటూ ఏడవడంతో దీప కాస్త ఆలోచనలో పడుతుంది. నేను నేరుగా వచ్చి కోర్టులో లొంగిపోయి కార్తీక్ విడిపిస్తాను నన్ను చంపొద్దు అంటూ బ్రతిమాలింది. అప్పటికి కార్తీక్ నన్ను పెళ్లి చేసుకుంటే విడిపిస్తానని చెప్పినప్పటికీ కార్తీక్ నా మాట వినలేదు. నేను కోర్టులో లొంగిపోయి కార్తీక్ విడిపిస్తానని మోనిత చెప్పడంతో దీప గన్ కిందకు దించుతుంది.
ఇక కట్ చేస్తే కోర్టులో విచారణ జరుగుతూ ఉండగా కార్తీక్ మోనితని చంపలేదని వివిధ రూపాలు మార్చుకుంటూ తిరుగుతోందని తను వచ్చిన గెటప్లో గురించి మాట్లాడుతాడు. అదేసమయంలో మోనిత తరఫున లాయరు కేవలం కేసు నుంచి బయట పడటం కోసమే మాట్లాడుతున్న మాటలు అంటూ వాదిస్తాడు. ఇక కార్తీక్ తరఫున న్యాయవాది విచారణ కోసం ఏసిపి రోషినిని మరోసారి విచారించడానికి పిలిపిస్తారు. తరువాయి భాగంలో తీర్పు విన్న న్యాయమూర్తి కార్తీక్ కు శిక్ష విధిస్తుంది సమయంలో దీపా ఎంట్రీ ఇస్తూ సాక్ష్యం ఉందని, సాక్ష్యం వైపు చూసేసరికి అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి దీప నిజంగానే మోనితను కోర్టుకు తీసుకు వచ్చిందా లేదా అనే విషయం తర్వాత ఎపిసోడ్లు చూడాల్సి ఉంది.