దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏపీలో ఆరు వేలకు పైగా కరోనా కేసులు, తెలంగాణలో నాలుగు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. కరోనా బారిన పడకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వీలైనంత త్వరగా తీసుకుంటే మంచిది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఎయిమ్స్ డాక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని వెల్లడించారు. కరోనా మొదటి డోసును ప్రైమ్ డోసు అంటారని ఆయన వెల్లడించారు.
మొదటి డోసు ప్రతిరోధకాల కోసం రోగనిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తుందని తొలి దశలో ప్రతిరోధకాలు విడుదలైనా అవి ఎక్కువ కాలం ఉండవని తెలిపారు. బూస్టర్ డోసుగా చెప్పే రెండో డోసుతో భారీగా ప్రతిరోధకాలు ఉత్పత్తి అవుతాయని అప్పుడే కరోనా వైరస్ నుంచి బలమైన రక్షణ లభిస్తుందని రెండో డోస్ తోనే మెమొరీ కణాలు కూడా ప్రేరేపితమవుతాయని పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం వల్ల వైరస్‌ను శరీరం దీర్ఘకాలం గుర్తుంచుకునే వీలుంటుందని భవిష్యత్తులో వైరస్ బారిన పడినా త్వరితగతిన ప్రతిరోధకాలు విడుదలవుతాయని గులేరియా వెల్లడించారు