కరోనా మహామ్మారి విజృంభణ వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కరోనా కష్టాల వల్ల కొంతమంది ఎక్కువ వడ్డీకి రుణాలను తీసుకుంటున్నారు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లకు సులువుగా రుణాలను మంజూరు చేస్తోంది. తక్కువ వడ్దీకే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సులువుగా రుణం పొందవచ్చు.
ఎస్‌బీఐ ఇ-ముద్రా స్కీమ్ ద్వారా రుణం పొందాలని అనుకునే వాళ్లు ఈ రుణం కోసం ఇంటినుంచేస్ సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. చిరు వ్యాపారం చేయాలని భావించే వాళ్ల కోసం ఎస్బీఐ రుణం మంజూరు చేస్తుండగా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎస్‌బీఐలో సేవింగ్స్ ఖాతా కలిగి ఉంటే మాత్రం ఈ లోన్ ను తీసుకోవచ్చు.
ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసి కనీసం ఆరు నెలలు దాటిన వాళ్లకు మాత్రమే ఈ లోన్ ను మంజూరు చేస్తుంది. 50 వేల రూపాయల వరకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా 50,000 రూపాయల కంటే ఎక్కువ రుణం కావాలంటే బ్యాంకుకు వెళ్లి డాక్యుమెంట్లను అందించాల్సి ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
లోన్ ఓకే అయితే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్, బిజినెస్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ నంబర్ వంటివి అందించడం ద్వారా సులభంగా లోన్ ను పొందే అవకాశాలు ఉంటాయి.