https://oktelugu.com/

Corona: తెలుగు రాష్ట్రల్లో కరోనా కలకలం

ఏపీలో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలికేసు నమోదయింది. 85 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ సోకినట్లు సమాచారం. శాంపిల్ ను సేకరించి ల్యాబ్ కు తరలించారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 22, 2023 / 02:52 PM IST

    Corona

    Follow us on

    Corona: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి. అందులో 16 కేసులు హైదరాబాదులోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
    ఇప్పటికే దేశవ్యాప్తంగా సబ్ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది. ముఖ్యంగా కేరళలో ప్రమాద ఘంటికలు మోగాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.

    ఏపీలో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలికేసు నమోదయింది. 85 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ సోకినట్లు సమాచారం. శాంపిల్ ను సేకరించి ల్యాబ్ కు తరలించారు. ఏలూరులో మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రజలు ఆందోళన పడవద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

    అటు హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు కరోనా బారిన పడ్డారు. గత నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల చిన్నారిలో కరోనా లక్షణాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం తెలంగాణలో 19 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ లో చిన్నారులపై ప్రభావం చూపుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆసుపత్రులు, వ్యాపార సముదాయాలు, జన సమూహాల వద్ద మాస్క్ తప్పనిసరి చేస్తూ అధికారుల ఆదేశాలు జారీ చేస్తున్నారు.