Homeఎంటర్టైన్మెంట్Shivaji: పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించిన శివాజీ.. షాకింగ్ కామెంట్స్

Shivaji: పల్లవి ప్రశాంత్ అరెస్టుపై స్పందించిన శివాజీ.. షాకింగ్ కామెంట్స్

Shivaji: బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 విజేతగా పల్లవి ప్రశాంత్‌ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ సేపు కొనసాగలేదు. బిగ్‌ బాస్‌షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ చేసిన అల్లర్లలో పలు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అల్లర్లు ఆగలేదు. ప్రశాంత్‌ తన ఫ్యాన్స్‌కి, అనుచరులకు నచ్చజెప్పి పోలీసులకు సహకరించాల్సింది పోయి రెచ్చగొట్టేలా వ్యవహరించారని కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ప్రశాంత్‌ ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు. పల్లవి ప్రశాంత్‌ లేనిపోని వివాదాల్లో చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచాడనే సంతోషం లేకుండా పోయింది అని అంటున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ తీరుని తప్పుబడుతూ కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. మరికొందరు పల్లవి ప్రశాంత్‌ కి మద్దతు తెలుపుతున్నారు.

ఎట్టకేలకు స్పందించిన శివాజీ
ఫ్యాన్స్‌ అతివల్లే ప్రశాంత్‌ ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు అని అంటున్నారు. అయితే ప్రశాంత్‌ అరెస్ట్‌ పై ఇప్పటికే చాలా మంది స్పందించారు. హౌస్‌లో ప్రశాంత్‌కి ఎంతో మద్దతుగా, అన్నగా ఉన్న శివాజీ రియాక్షన్‌ కోసం అంతా ఎదురుచూశారు. ఫ్రెండ్‌ కష్టాల్లో ఉంటే శివాజీ స్పందించడం లేదు ఏంటి అని ఆశ్చర్యపోయినవాళ్లు కూడా ఉన్నారు. ఎట్టకేలకు శివాజీ ప్రశాంత్‌ అరెస్ట్‌పై స్పందించారు. చాలా మంది ప్రశాంత్‌ గురించి మాట్లాడాలని అంటున్నారు. ‘‘నేను చెప్పేది ఒక్కటే.. ప్రశాంత్‌ కి ఏమీ కాదు.. చట్ట ప్రకారం ప్రశాంత్‌ త్వరగానే బయటకి వస్తాడు. ప్రశాంత్‌ కి చట్టంపై గౌరవం ఉంది. పారిపోయాడు అంటూ చాలా మంది కామెంట్స్‌ చేశారు. అలా చేయడం కరెక్ట్‌ కాదు. ప్రశాంత్‌ తో నాలుగు నెలలపాటు హౌస్‌ లో ఉన్నాను. అతడు ఎలాంటి వాడో నాకు తెలుసు. బయట ఏం జరుగుతుంది అనేది ప్రశాంత్‌ కి తెలియదు. అతడు రాకముందే కొందరు కారు అద్దాలు ధ్వంసం చేశారు. వాళ్లు ఎవరి అభిమానుల్లో తెలియదు. ఎవరు చేసినా జరిగింది చాలా తప్పు. అమర్‌ దీప్‌ ఫ్యామిలీ ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. ప్రశాంత్‌ గురించి పదేపదే నేను బయటకి వచ్చి స్పందించాల్సిన అవసరం లేదు”.

ప్రశాంత్ నేరస్థుడు కాదు..
”వివాదం జరిగిన మొదటి గంట నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిణామాలు నాకు తెలుసు. సోమవారం లోపు ప్రశాంత్‌ బయటకి వస్తాడు. ప్రశాంత్‌ నేరస్థుడు కాదు, క్రిమినల్‌ కాదు. వాళ్ల కుటుంబ సభ్యులతో నేను టచ్‌ లో ఉన్నా. గెలిచాను అనే సంతోషం కొన్నిసార్లు మనిషిని డామినేట్‌ చేస్తుంది. దానిని హ్యాండిల్‌ చేసే వయసు కూడా ప్రశాంత్‌ కి లేదు. అక్కడ జరిగిన తప్పే కానీ.. ప్రశాంత్‌ ఏ పొరపాటు చేయలేదు. దయచేసి ప్రశాంత్‌ గురించి దారుణమైన థంబ్‌ నెయిల్స్‌ ఎవరూ పెట్టొద్దు. ఎవరో చేసిన తప్పుకి, ఫ్యాన్స్‌ పేరుతో జరిగిన అల్లర్లకు ప్రశాంత్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు’’ అని శివాజీ అన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper
Exit mobile version