రెండు నెలల క్రితం దేశంలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వల్ల వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. కోళ్లు చనిపోవడంతో చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని ప్రజల్లో చాలామంది చికెన్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఫలితంగా చికెన్ ధరలు భారీగా తగ్గడంతో పాటు కోళ్ల పెంపకందారులు భారీగా నష్టపోయారు. కరోనా విజృంభించిన తొలినాళ్లలో సైతం. చికెన్ తింటే కరోనా సోకుతుందని జోరుగా ప్రచారం జరిగింది.
బర్డ్ ఫ్లూ వల్ల భారీగా నష్టాలు రావడంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయ వ్యాపారాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం కోళ్ల లభ్యత తగ్గగా చికెన్ కు డిమాండ్ మాత్రం పెరిగింది. డిమాండ్ పెరగడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధర 200 రూపాయలు దాటింది. కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ ఏకంగా 240 రూపాయలు పలుకుతుండటం గమనార్హం. కరోనా విజృంభణ వల్ల తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది.
మరికొన్ని రోజుల్లో చికెన్ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చికెన్ తినొద్దంటూ వస్తున్న పుకార్ల వల్ల ఫౌల్ట్రీ రైతులు కోళ్లను పెంచాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులు కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టడం లేదు. కరోనా విజృంభణ వల్ల కోళ్ల పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో చికెన్ ధరలు పెరుగుతాయో తగ్గుతాయో చుడాల్సి ఉంది.
మరోవైపు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్న ప్రజలు చికెన్ ధరలు పెరిగితే తమపై భారం మరింత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం